Telugu Directors: హిట్టు కొట్టినా కొత్త సినిమా పట్టాలెక్కించలేని దర్శకులు!

హిట్టు సినిమా పడితే ఏ డైరెక్టర్ ఐనా.. వెంటనే రెండు మూడు సినిమాల్ని పట్టాలెక్కించి జోరు పెంచుతారు.

Telugu Directors: హిట్టు కొట్టినా కొత్త సినిమా పట్టాలెక్కించలేని దర్శకులు!

Telugu Directors

Telugu Directors: హిట్టు సినిమా పడితే ఏ డైరెక్టర్ ఐనా.. వెంటనే రెండు మూడు సినిమాల్ని పట్టాలెక్కించి జోరు పెంచుతారు. కాని టాలివుడ్ లో కొంతమంది డైరెక్టర్లు మాత్రం హిట్టు కొట్టినా సరే.. ఇంకో సినిమాను ముట్టడం లేదు. ఓవైపు హీరోలంతా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ దూసుకుపోతుంటె.. డైరెక్టర్స్ మాత్రం ఢల్ అయిపోయారు.. ఏళ్లు గడుస్తున్నా ఇంకా యాక్షన్ చెప్పడం లేదు.

Naga Shaurya: ఒక్క హిట్ ప్లీజ్.. బ్రేక్ కోసం నాగశౌర్య ఫీట్స్

కోవిడ్ పుణ్యమా అని టాలివుడ్ లో.. చాలా మంది డైరెక్టర్ల స్పీడుకు బ్రేకులు పడ్డాయి. హిట్టు సినిమా పడినా ఇంకో సినిమాను ముట్టుకునే ధైర్యం చేయడం లేదు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కెమెరా.. యాక్షన్ చెప్పక రెండేళ్లు గడిచిపోయింది. 2020 సంక్రాంతికి త్రివిక్రమ్, బన్నీ కాంబోలో అల వైకుంఠాపురంలో మూవీ రిలీజై సూపర్ హిట్ అయ్యింది. అప్పటి నుంచి మాటల మాంత్రికుడు ఖాళీగానే ఉన్నాడు.

Katrina Kaif: పెళ్ళైనా.. దాచుకొనేదేలే!

అలా వైకుంఠాపురంలో తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా అనుకున్నాడు.. ఆ తర్వాత మహేశ్ బాబుతో మూవీ కన్ఫాం చేసుకున్నాడు. ప్రస్తుతం ఫోకసంతా దానిమీదే పెట్టాడు. ఐతే మహేశ్, త్రివిక్రమ్ సినిమా ఈ ఏడాది మాత్రం వచ్చే ఛాన్స్ లేదు.. సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ అవ్వటానికి ఇంకాస్త టైం పట్టే ఛాన్స్ ఉందట. ఒకవేళ ఏప్రిల్ ఒకటిన సర్కారు వారి పాట రిలీజై.. వెంటనే త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదికి వెళ్లినా.. ఈ ఏడాది రిలీజ్ అవుతుందన్న గ్యారంటీ లేదు. బ్యాక్ ఎండ్ లో ఉండి సపోర్ట్ చేస్తున్న భీమ్లా నాయకే.. ఈ ఏడాదికి త్రివిక్రమ్ సినిమా అనుకోవాల్సిన పరిస్థతి వచ్చింది.

Allu Arjun: బన్నీ కోసం బాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్స్ వెయిటింగ్!

అలవైకుంఠాపురంలో తర్వాత త్రివిక్రమ్ స్లో ఐతే.. బన్నీ మాత్రం పుష్పతో సూపర్ హిట్టుకొట్టి.. పుష్పా సెకెండ్ పార్ట్ కోసం స్పీడుగా రెడీ అవుతున్నాడు. ఇక మరో స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి సిచ్చుయేషన్ కూడా ఇలాగే ఉంది. 2019లో వచ్చిన మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మరో సినిమా రాలేదు. తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో సినిమా అనౌన్స్ చేశినా.. అదెప్పటికి పూర్తవుతుందో క్లారిటీ లేదు. సో.. సూపర్ హిట్టు పడినా వంశీ పైడిపల్లి మూడేళ్లుగా ఖాళీగానే ఉన్నాడు.

Amala Paul: అమలా హాట్ లుక్స్ కిల్లింగ్ అంతే!

2019లో గద్దలకొండ గణేశ్ తో హిట్టు కొట్టిన.. డైరెక్టర్ హరీశ్ శంకర్ సిచ్చుయేషన్ కూడా సేమ్. ఇప్పటివరకు మరో సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లలేదు. పవన్ తో భగత్ సింగ్ కన్ఫామ్ ఐనా.. ఇప్పుడప్పుడే పట్టాలెక్కెట్టు లేదు. ఐతే.. గద్దలకొండ గణేశ్ తో హిట్టుకొట్టిన హీరో వరుణ్ తేజ్ మాత్రం గనీ, ఎఫ్ 3 సినిమాలు చేశాడు. రెండూ ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి.

Sid Sriram: ఎక్కడ విన్నా సిద్ పాటే.. ఒక్కో పాటకి ఎంత తీసుకుంటాడో తెలుసా?

2018లో వచ్చిన మహానటితో హిట్టుకొట్టి మంచి పేరు తెచ్చుకున్న.. డైరెక్టర్ నాగ అశ్విన్ కూడా నాలుగేళ్లుగా ఖాళీగానే ఉంటున్నాడు. మద్దెలో పిట్టకథలు అనే వెబ్ సిరీస్ కోసం గెస్ట్ డైరెక్షన్ చేశాడు తప్పితె.. ఇప్పటిదాకా మరో సినిమా చేయలేదు. ప్రభాస్ తో మూవీ కన్ఫామ్ ఐనా.. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్ షూటింగ్స్ తో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. సో ఇప్పుడప్పుడే సినిమా మొదలుపెట్టే ఛాన్సే లేదు.

Kollywood Stars: టాలీవుడ్‌లో పాగా వేసేందుకు తమిళ తంబీల ప్లాన్స్!

హిట్టు సినిమాలు తీసినా చాలామంది టాలివుడ్ డైరెక్టర్స్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు.. గతేడాది వకీల్ సాబ్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ మరో సినిమా కన్ఫామ్ చేయలేదు.. వకీల్ సాబ్ హీరో పవన్ మాత్రం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. లవ్ స్టోరీ మూవీతో హిట్టుకొట్టిన శేఖర్ కమ్ముల తమిళ్ లో ఓ సినిమా కన్ఫామ్ చేశినా.. తెలుగులో ఇంకో సినిమా ముట్టుకోలేదు. లవ్ స్టోరీ హీరో నాగ చైతన్య మాత్రం బంగార్రాజుతో మరో హిట్టు కొట్టాడు.. ప్లాపు సినిమా పడి ఛాన్సులు రాలేదంటె ఏమో అనుకోవచ్చు కాని.. ఇలా హిట్టు పడినాసరే చాలామంది డైరెక్టర్లు ఖాళీగా ఉంటున్నారు.