Telugu Dubbing Movies: నేషనల్ వైడ్ తెలుగు సినిమా డబ్బింగ్ మేళా

బాలీవుడ్ లో తెలుగు డబ్బింగ్ సినిమాల మేళా జరుగబోతుంది. ఒక్క హిందీ అనే కాదు... ఇటు సౌత్ ఆడియెన్స్ కూడా తెలుగు సినిమా చూసేందుకు..

Telugu Dubbing Movies: నేషనల్ వైడ్ తెలుగు సినిమా డబ్బింగ్ మేళా

Telugu Dubbing Movies

Telugu Movies Dubbing: బాలీవుడ్ లో తెలుగు డబ్బింగ్ సినిమాల మేళా జరుగబోతుంది. ఒక్క హిందీ అనే కాదు… ఇటు సౌత్ ఆడియెన్స్ కూడా తెలుగు సినిమా చూసేందుకు తహతహలాడుతున్నారు. ఎప్పుడైతే టాలీవుడ్ సత్తా అందరికీ తెలిసిందో.. తెలుగు సినిమా మా భాషలో రిలీజ్ చేయడంటూ ఆడియెన్స్ రిక్వెస్ట్ లు మీద రిక్వెస్టులు పెడుతున్నారు. డిమాండ్ ను బట్టి మనవాళ్లు కూడా గట్టిగానే క్యాష్ చేసుకుంటున్నారు.

Prabhas: పాన్ వరల్డ్ రేంజ్.. ప్రభాస్ ఇకపై పాన్ ఇండియాస్టార్ కాదు!

తెలుగు సినిమా స్టైల్ మారింది. ఇక్కడి హీరోల సినిమాలు చూసేందుకు నేషనల్ వైడ్ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. మా భాషలో తెలుగు సినిమాను తీసుకురండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. పుష్ప క్రేజ్ తర్వాత అల వైకుంఠపురంలో సినిమా థియేటర్స్ కి వెళ్లుంటే ఆ లెక్క వేరుండేది కానీ షెహ్ జాదా రీమేక్ తో బన్నీ తగ్గాల్సి వచ్చింది. అటు బాలీవుడ్ స్క్రీన్స్ పై తెలుగు స్టార్ హీరోల దాడి కూడా అక్కడివారిని భయపెడుతోంది.

Unstoppable with NBK: రెండో సీజన్ కి సర్వం సిద్ధం.. తొలి గెస్ట్ ఎవరంటే?

నిన్నమొన్నటివరకు పక్క ఇండస్ట్రీల డబ్బింగ్ సినిమాలు మన దగ్గర రచ్చే చేసేవి. కానీ సీన్ మారాక ఇక్కడి సినిమాలు వేరే ఇండస్ట్రీలకు సవాల్ విసురుతున్నాయి. అయితే యూట్యూబ్ లో, హిందీ ఛానల్స్ లో ప్రసారమయ్యే టాలీవుడ్ డబ్బింగ్ సినిమాలకు ఆడియెన్స్ లో బాగా క్రేజ్ ఉంది. ఆల్రెడీ ఆ మూవీస్ తో తెలుగు హీరోలు పరిచయం కాబట్టే.. డైరెక్ట్ థియేటర్స్ కొస్తే ఎగబడుతున్నారు జనం. లేటెస్ట్ రామ్ మూవీ ది వారియర్ హిందీ డబ్బింగ్ రైట్స్ 16కోట్లకు పోయిందంటే ఇక్కడి సినిమాకున్న స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Bheemla Nayak: భీమ్లా వాయిదా పడిందా? లేక శర్వా ధైర్యం చేశాడా?

సోషల్ మీడియాలో అఖండను అన్ని భాషల్లో రిలీజ్ చేయమని తెగ ట్వీట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మాక్సిమమ్ ఆడియెన్స్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఓటీటీలో చూసేస్తున్నారు. సో తమిళ్ లో డబ్ చేసి అఖండను థియేటర్స్ లో వదులుతున్నారు మనవాళ్లు. హిందీ కోసం కూడా ఎప్పుడెప్పుడా అనే టాక్స్ నడుస్తున్నాయి. ట్రిపుల్ ఆర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం కూడా డబ్బింగ్ కి రెడీ అవుతోంది. తెలుగు డబ్బింగ్ సినిమాలకు పాపులరైన గోల్డ్ మైన్స్ ప్రొడక్షన్ హౌజ్ రంగస్థలాన్ని హిందీలోకి మార్చింది. ఇక పాన్ ఇండియా పేరుతో రాబోయే తెలుగు స్టైట్ సినిమాలను కూడా అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసేలా మేకర్స్ అందరూ ప్లానింగ్ లో ఉన్నారు. ఖిలాడీతో ముందు రవితేజ ఈ ఫీట్ సాధించేలా ఉన్నారు.