Telugu Cinema : తెలుగు సినీ పరిశ్రమలో మరో ఎన్నికల యుద్దం.. మొదలైన వివాదాలు

తెలుగు సినీ పరిశ్రమలో 'మా' ఎన్నికల రచ్చను, రసాభాసను మర్చిపోకముందే మరో ఎన్నికల వివాదం మొదలైంది. ఈ నెల 14న తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ

Telugu Cinema : తెలుగు సినీ పరిశ్రమలో మరో ఎన్నికల యుద్దం.. మొదలైన వివాదాలు

Tfda

Telugu Cinema :  తెలుగు సినీ పరిశ్రమలో ‘మా’ ఎన్నికల రచ్చను, రసాభాసను మర్చిపోకముందే మరో ఎన్నికల వివాదం మొదలైంది. ఈ నెల 14న తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం పలువురు దర్శకులు పోటీపడుతున్నారు. అందులో ఇద్దరు నామినేషన్లని తిరస్కరించడంతో వివాదానికి కారణమైంది. సీనియర్ సినీ జర్నలిస్టు, ఫిలిం క్రిటిక్, దర్శకుడు ప్రభు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నకారణంగా చలనచిత్ర దర్శకుల సంఘంలో పోటీ చేయడానికి వీలులేదు అంటూ ఆయన నామినేషన్ ను తిరస్కరించారు.

చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ లో ఏదైనా అసోసియేషన్ పదవిలో ఉన్నట్లయితే దర్శకుల సంఘంలో పోటీ చేయకూడదు అనే నిబంధన ఉంది అనే సాకుతో తన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి కెవిఆర్ చౌదరి తిరస్కరించటాన్ని ప్రభు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ కి, క్రిటిక్స్‌ అసోసియేషన్‌కి సంబంధం లేదని, కానీ అన్యాయంగా తన నామినేషన్‌ని తిరస్కరించారని ప్రభు ఆవేదన వ్యక్తం చేశారు.

Manas – Priyanaka : మానస్, ప్రియంకల పెళ్ళికి ఒప్పుకోను : మానస్ తల్లి

అలాగే మరొక సీనియర్ దర్శకుడు మద్దినేని రమేష్ నామినేషన్ ని కూడా తిరస్కరించారు. తన నామినేషన్ ని తిరస్కరించడంతో కొందరు సినీ పెద్దల హస్తం ఉందని, గత కమిటీకి రిటర్నింగ్ ఆఫీసర్ చౌదరి వత్తాసు పలుకుతున్నదని మద్దినేని రమేష్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.

న్యాయపరంగా తేల్చుకుంటానని రమేష్ అన్నారు. ప్రభు కూడా తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించిన కారణం అప్రజాస్వామికంగా ఉందంటూ కోర్టును ఆశ్రయిస్తాను అని తెలిపారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ మరో ఎన్నికల వివాదానికి తెర తీయబోతున్నట్టు తెలుస్తుంది.