Telugu Film industry : ఏపీ ప్రభుత్వంతో చర్చలకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కమిటీ ఏర్పాటు

ఏపీ ప్రభుత్వంతో చర్చలకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కమిటీ ఏర్పాటు చేసింది..

Telugu Film industry: ఏపీ ప్రభుత్వంతో చర్చలకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మొత్తం 17మంది సభ్యులున్నారు. ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి ఆరుగురు, ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి ఐదుగురు, డిస్టిబ్యూటర్ సెక్టార్ నుంచి ఆరుగురుని కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు.

Shyam Singha Roy : థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తోంది-ఆర్.నారాయణ మూర్తి

ఈ మేరకు 17 మంది కమిటీ సభ్యుల పేర్లతో ఏపీ హోంశాఖ స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్‌కు లేఖ రాశారు. తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యలు, టికెట్ ధరల తగ్గింపు అంశంపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి కమిటీ సభ్యులు.. దిల్ రాజు, సి.కళ్యాణ్, వంశీ కృష్ణా రెడ్డి, ఏలూరు సురేందర్ రెడ్డి, ప్రసన్నకుమార్.

Vijay Deverakonda : తెలంగాణ సర్కార్ ఇండస్ట్రీ బాగును కోరుకుంటోంది..

ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి కమిటీ సభ్యులు.. నారాయణ కృష్ణ దాస్ నారంగ్, వీర నారాయణ బాబు, టి.ఎస్. రాంప్రసాద్, పి. శ్రీనివాసరావు, వి.ప్రతాప్ రెడ్డి, ఎన్వీ ప్రసాద్. డిస్టిబ్యూటర్ సెక్టార్ నుంచి కమిటీ సభ్యులు.. రాందాసు, రమేష్, మోహన్ రెడ్డి, భరత్ చౌదరి, అభిషేక్ నామా, వీరి నాయుడు.

Siddharth : దోచుకుంటోంది రాజకీయ నేతలే..! ముందు మీ అవినీతి తగ్గించుకోండి

ట్రెండింగ్ వార్తలు