TFPC : దిల్ రాజుకి షాకిచ్చిన తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి.. తెలుగు పండగలకి తెలుగు సినిమాలకే థియేటర్లు..

తాజాగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దిల్ రాజు గతంలో చెప్పిన వ్యాఖ్యలనే ప్రామాణికంగా తీసుకున్నాము అంటూ దిల్ రాజుకే కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రెస్ నోట్ లో................

TFPC : దిల్ రాజుకి షాకిచ్చిన తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి.. తెలుగు పండగలకి తెలుగు సినిమాలకే థియేటర్లు..

Telugu film producer council press note regarding festival movies

TFPC :  పండగలకి మనదగ్గర సినిమాల సందడి ఎక్కువే ఉంటుంది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ తమ సినిమాలని పండగల టైంలోనే రిలీజ్ చేసి సక్సెస్ కొట్టాలనుకుంటారు. ఇక దసరా, సంక్రాంతి లాంటి పెద్ద పండగలకైతే పోటీ దారుణంగా ఉంటుంది. ఓ పక్క తెలుగు సినిమాలు పోటీ పడుతుంటే మరో పక్క తమిళ సినిమాలు కూడా పండగ బరిలోకి దిగడానికి రెడీ అవుతాయి.

ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ పోటీ పడటానికి రెడీగా ఉన్నారు. మరికొన్ని తెలుగు సినిమాలు కూడా సంక్రాంతి రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అయితే తమిళ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్ సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. అజిత్ తెలుగు మార్కెట్ ని పెద్దగా పట్టించుకోరు, కాబట్టి సినిమా రిలీజ్ అవ్వకపోయినా లెక్క చేయరు. కానీ విజయ్ కి తెలుగులో మార్కెట్ ఉండటంతో ఆయన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సారి విజయ్ వరిసు సినిమాతో రాబోతున్నాడు. తెలుగులో వారసుడుగా రాబోతుంది. తమిళ సినిమాగా తెరకెక్కుతున్నా ఈ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజ్ తెలుగు వాళ్ళు. దిల్ రాజు గురించి తెలిసిందే. దీంతో సంక్రాంతికి దిల్ రాజు వరిసు సినిమాని రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు. ఇటీవల షూటింగ్స్ ఆపినప్పుడు వరిసు సినిమా షూటింగ్ ఎందుకు ఆపలేదు అని అడిగితే అది తమిళ సినిమా అని సమాధానం ఇచ్చాడు దిల్ రాజు.

తాజాగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దిల్ రాజు గతంలో చెప్పిన వ్యాఖ్యలనే ప్రామాణికంగా తీసుకున్నాము అంటూ దిల్ రాజుకే కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రెస్ నోట్ లో.. తెలుగు చలన చిత్రాల పెరిగిన నిర్మాణ వ్యయము దృష్టిలో పెట్టుకొని మరియు నిర్మాత శ్రేయస్సు కోరి తెలుగు సినిమాని కాపాడుకుందాం అనే లక్ష్యంతో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ది: 08-12-2017 తేదీన జరిగిన అత్యవసర మీటింగులో, “సంక్రాంతి, దసరా పండుగలకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది”.

ఈ విషయమై, ప్రముఖ నిర్మాత మరియు ఛాంబర్ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ శ్రీ దిల్ రాజు గారు 2019 సంవత్సరంలో మీడియా ద్వారా స్ట్రెయిట్ సినిమాలు ఉండగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తాం అని ఘాటుగా వ్యాఖ్యలు చేసి ఆ ప్రకారమే స్ట్రెయిట్ సినిమాలకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వాటిని డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయాన్ని విధిగా అమలుపర్చాలని తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడుకుంటూ ఈ సారి కూడా స్ట్రెయిట్ గా తీసిన తెలుగు చిత్రాలకు ప్రధమ ప్రాధ్యానత ఇస్తూ మిగిలిన వాటిని మాత్రమే డబ్బింగ్ సినిమాలకు సంక్రాతి, దసరా పండుగలలో కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సినిమా ఎక్సిబిటర్స్’ను కోరుచున్నాము” అని తెలిపారు.

Charan-Akshay : సినిమా ఫ్లాప్స్ పై స్పందించిన అక్షయ్, చరణ్.. అది మా తప్పే.. మేము కూడా రెమ్యునరేషన్స్ తగ్గించుకుంటున్నాము..

దీంతో ఈ సారి సంక్రాంతి బరిలో దిగాలని ట్రై చేస్తున్న దిల్ రాజుకి తాను చెప్పిన మాటలనే చెప్పి షాక్ ఇచ్చారు తెలుగు ప్రొడ్యూసర్ ఫిలిం కౌన్సిల్. మరి ఈ పండగకి వరిసు సినిమాకి థియేటర్స్ దొరుకుతాయా లేదా సినిమాని వాయిదా వేస్తారా చూడాలి. దీనిపై దిల్ రాజు అయితే ఇంకా స్పందించలేదు.