Puli Vachindi Meka Sachindi: పులొచ్చింది మేక చచ్చింది – రివ్యూ

తెలుగులో తొలి 360 డిగ్రీల స్క్రీన్ ప్లే చిత్రంగా తెరకెక్కిన సినిమా పులొచ్చింది మేక చచ్చింది. ఈ చిత్రాన్ని దర్శకుడు అ శేఖర్ యాదవ్ తన తొలి చిత్రంగా రూపొందించారు.

Puli Vachindi Meka Sachindi: పులొచ్చింది మేక చచ్చింది – రివ్యూ

Puli Vachindi Meka Sachindi

నటీనటులు: నటీనటులు: జయలలిత, చిత్రం శ్రీను, ఆనంద్ భారతి, గోవర్థన్ రెడ్డి, నిహారిక రెడ్డి, యోగి, వర్ష, మను, అ శేఖర్ యాదవ్, చందు, సుజిత్, శంకర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: కిరణ్ కుమార్ దీకొండ,
సంగీతం: సుభాష్ ఇషాన్,
ఎడిటింగ్‌: శ్రీనివాస్ అన్నవరపు
నిర్మాత: భవానీ శంకర్ కొండోజు
డైలాగ్స్: నాత్మిక
రచన, దర్శకత్వం: అ శేఖర్ యాదవ్

తెలుగులో తొలి 360 డిగ్రీల స్క్రీన్ ప్లే చిత్రంగా తెరకెక్కిన సినిమా పులొచ్చింది మేక చచ్చింది. ఈ చిత్రాన్ని దర్శకుడు అ శేఖర్ యాదవ్ తన తొలి చిత్రంగా రూపొందించారు. మోస్ట్ అవేటెడ్ పుష్ప సినిమాతో పాటు ఈ శుక్రవారం ఈ సినిమా కూడా థియేటర్లలోకి వచ్చింది. మానవ మనస్తత్వాలకు అద్దం పడుతూ మనిషి మానసిక బలహీనతలను చూపిస్తూ సాగిన సినిమా పులొచ్చింది మేక చచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..

కథ:

రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గోవి (మను), క్రిమినల్ పాండా (ఆనంద్ భారతి) మంచి స్నేహితులు. వీరి సరదా మాటల్లో తానో పుస్తకం రాయాలనుకుంటున్నాననీ మంచి క్రైమ్ స్టోరీ చెప్పమంటాడు పాండా. స్నేహితుడి రిక్వెస్ట్ పై తన కెరీర్ లో చూసిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ చెబుతాడు గోవి. ఆ స్టోరీలోకి వెళ్తే…కుటుంబ సభ్యులైన రాబర్ట్ (చిత్రం శ్రీను), అరుణ కుమారి (నిహారిక), వాసుదేవ్ (యోగి), వైశాలి (వర్ష)..ఈ నలుగురు కలిసి తమ ఇంట్లో చిన్న పిల్లాడిని చంపాలని ప్రయత్నిస్తుంటారు. కుటుంబ సభ్యుడైన ఆ బాలుడిని వీళ్లు ఎందుకు చంపాలనుకున్నారు. ఆ కుటుంబంతో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి గోవికి ఉన్న రిలేషన్ ఏంటి, వాళ్లు అనుకున్న పని చేశారా లేదా, చివరకు ఇదంతా ఎలాంటి మలుపులు తిరిగింది అనేది మిగిలిన కథ.

నటీనటులు:

రాబర్ట్ గా చిత్రం శ్రీను చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి నిడివి గల పాత్రలో నటించాడు. అతని నటనలో క్రౌర్యం, పశ్చాతాపం లాంటి ఎమోషన్స్ బాగా పండాయి. అరుణ కుమారి క్యారెక్టర్ లో మెప్పించింది. నిహారిక అలాగే వాసుదేవ్ గా యోగి, వైశాలిగా వర్ష బాగా పర్మార్స్ చేశారు. గోవి క్యారెక్టర్ లో మను పాత్రకు తగినట్లు నటించాడు. మంచి విలనీని చూపించాడు. అలాగే ఆనంద్ భారతి క్యారెక్టర్ చిన్నదే అయినా కథకు కీలకంగా చెప్పుకోవచ్చు.

సాంకేతిక వర్గం:

ఇషాన్ సుభాన్ చేసిన మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కిరణ్ కుమార్ దీకొండ సినిమాటోగ్రఫీ కథలోని సస్పెన్స్ డ్రామాను ప్రతి సీన్ లో క్రియేట్ చేశాయి. ప్రొడక్షన్ వ్యాల్సూస్ కథకు సరిపోయేలా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది. సస్పెన్స్ క్రియేషన్ కోసం దర్శకుడు కొన్ని సీన్స్ ను స్లో మోషన్ లో చూపించాడు. ఈ సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే కథనంలో వేగం మరింత పెరిగి సినిమా ఇంకాస్త థ్రిల్ ఫీల్ తెచ్చేది.

విశ్లేషణ:

చిన్న సినిమానే అయినా తెలుగు తెరపై ఇప్పటిదాకా రాని స్క్రీన్ ప్లేతో వచ్చింది పులొచ్చింది మేక చచ్చింది సినిమా. దర్శకుడు అ శేఖర్ యాదవ్ తొలి 360 డిగ్రీ స్క్రీన్ ప్లే సినిమాగా ఈ చిత్రాన్ని పరిచయం చేయడం విశేషంగానే చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఫస్టాప్, సెకండాఫ్ సమాంతరంగా చూపిస్తూ కథ సాగుతుంది. అందుకే ఈ సినిమా శుభం కార్డుతో మొదలై రెండు భాగాల సినిమా ప్రదర్శితమవుతుంది. ఇలా చేయాలంటే స్క్రీన్ ప్లేలో గందరగోళం లేకుండా స్పష్టత ఉండాలి. దర్శకుడు అ శేఖర్ యాదవ్ ఆ విషయంలో చాలావరకు న్యాయం చేశాడు. మనకు సమాజంలో కనిపించే కుటుంబాలు, అందులోని మనుషుల మానసిక బలహీనతలను కథలో సహజంగా చూపించారు దర్శకుడు. ఈ సినిమా కాంపాక్ట్ బడ్జెట్ లో కొత్త కథను విభిన్నమైన స్క్రీన్ ప్లేతో చూపించే ప్రయత్నమని చెప్పొచ్చు. భారీ చిత్రాలతో పాటు ఇలాంటి చిన్న చిత్రాలనూ ఇష్టపడే సినీ ప్రియులు ఓసారి చూడొచ్చు.