Film Festival : భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఎంపికైన ఏకైక తెలుగు సినిమా

ఈ సంవత్సరం జరగనున్న 52వ ఇఫీ వేడుకల వివరాలని తాజాగా వెల్లడించారు. ఈ నెల 20 నుంచి తొమ్మిది రోజుల పాటు నవంబర్ 28 వరకు గోవాలో ఈ చలన చిత్ర వేడుకలు జరగనున్నాయి. ఈ సంవత్సరం వేడుకల్లో

Film Festival : భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఎంపికైన ఏకైక తెలుగు సినిమా

Natyam (1)

Film Festival :  ప్రతి సంవత్సరం గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా (ఇఫీ) వేడుకలు జరుగుతాయి. ఈ సంవత్సరం జరగనున్న 52వ ఇఫీ వేడుకల వివరాలని తాజాగా వెల్లడించారు. ఈ నెల 20 నుంచి తొమ్మిది రోజుల పాటు నవంబర్ 28 వరకు గోవాలో ఈ చలన చిత్ర వేడుకలు జరగనున్నాయి. ఈ సంవత్సరం వేడుకల్లో ప్రదర్శించనున్న చిత్రాల జాబితాను కమిటీ విడుదల చేసింది. అన్ని దేశాల నుంచి ఫీచర్‌ విభాగంలో ప్రదర్శితం కావడానికి 221 చిత్రాలు ఎంట్రీ ఇవ్వగా 25 సినిమాలను సెలెక్ట్ చేసారు. నాన్‌ ఫీచర్‌ విభాగంలో 203 చిత్రాల నుంచి 20 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఊహించని విధంగా అదిరిపోయే మాస్ సాంగ్

మనదేశం నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ అయిన తమిళ చిత్రం ‘కూళంగళ్‌’తో పాటు పలు ప్రాంతీయ భాషా చిత్రాలను ఎంపిక చేశారు. ఇక్కడ ప్రదర్శనకోసం ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో తెలుగు నుంచి రేవంత్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ‘నాట్యం’ సినిమా చోటుదక్కించుకొంది. నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ జాబితాలో తెలుగు నుంచి ఏదీ సెలెక్ట్ అవ్వలేదు. ఈ వేడుకల్లో మన దేశ సినిమాలతో పాటు ఇంటర్నేషనల్ సినిమాలు కూడా ప్రదర్శితం చేసి అవార్డులు ఇస్తారు. ఈ వేడుకలో అమ్రికం ఫిలిం డైరెక్టర్ మార్టిన్ స్కోర్సెస్ కి, హన్గేరియన్ ఫిలిం డైరెక్టర్ ఇస్తవాన్ జబోకు సత్యజిత్ రే జీవిత సౌఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ వెల్లడించారు. ప్రతి సంవత్సరం గోవాలో ఎంతో ఘనంగా జరిగే ఈ ఫెస్టివల్ ఈ సంవత్సరం కూడా గ్రాండ్ గా సిద్ధమైపోయింది.