Tollywood : సంక్రాంతి, దసరా పండగల్లో తెలుగు సినిమాలకే ప్రాధాన్యత.. ఎగ్జిబిటర్ల ఏకగ్రీవ నిర్ణయం!

గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ల విషయంలో ఫైట్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే నేపథ్యంలో నిన్న తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎగ్జిబిటర్లతో అత్యవసర సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో...

Tollywood : సంక్రాంతి, దసరా పండగల్లో తెలుగు సినిమాలకే ప్రాధాన్యత.. ఎగ్జిబిటర్ల ఏకగ్రీవ నిర్ణయం!

Telugu films are given priority During festivals

Tollywood : గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ల విషయంలో ఫైట్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి టాలీవుడ్ బడా హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు విడుదల అవ్వుతున్న సమయంలోనే, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న తమిళ సినిమా ‘వారిసు’, తెలుగులో ‘వారసుడు’గా డబ్ అవుతున్న ఈ మూవీ కూడా సంక్రాంతి విడుదలకే సిద్ధమైంది.

Prabhas : అన్‌స్టాపబుల్ సెట్‌లో ‘ప్రభాస్’పై స్పెషల్ AV షూటింగ్.. ఫ్యాన్స్ హంగామా!

ఈ క్రమంలోనే దిల్ రాజు.. అధిక శాతంలో థియేటర్లను ‘వారిసు’ సినిమా కోసం ఆక్రమించినట్లు వార్తలు రావడంతో ఇండస్ట్రీలో వివాదం రాచుకుంది. దీంతో తెలుగు చిత్ర నిర్మాత మండలి సమావేశమయ్యి, సంక్రాంతికి తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటూ తీర్మానించింది. ఇదే నేపథ్యంలో నిన్న తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎగ్జిబిటర్లతో అత్యవసర సమావేశం అయ్యింది.

ఈ సమావేశంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్.. ఎగ్జిబిటర్లందరినీ సంక్రాంతి, దసరా పండగలకి ఎక్కువ ప్రాధాన్యత తెలుగు సినిమాలకే ఇవ్వాలంటూ కోరింది. దీంతో ఎగ్జిబిటర్లు అందరూ కూడా ‘ఓన్లీ తెలుగు చిత్రాలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా’ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.