Corona Precautions: కరోనా జాగ్రత్తలు చెప్పిన హీరోయిన్స్

కరోనా ఎవరిని వదలడం లేదు.. పర తమ బేధం లేకుండా వస్తుంది. యాచకులు నుంచి రాజకీయ నాయకులవరకు కరోనాతో అల్లాడుతున్నారు.

Corona Precautions: కరోనా జాగ్రత్తలు చెప్పిన హీరోయిన్స్

corona precautions

Corona Precautions: కరోనా ఎవరిని వదలడం లేదు.. పర తమ బేధం లేకుండా వస్తుంది. యాచకులు నుంచి రాజకీయ నాయకులవరకు కరోనాతో అల్లాడుతున్నారు. ఇక సినీ పరిశ్రమ కూడా కుదేలవుతోంది. సినీపరిశ్రమలోని చాలామందికి కరోనా సోకింది. టాప్ హీరోయిన్లు కరోనా బారినపడి కోలుకున్నారు. ఇక కొందరు సినీ కథానాయికలు తమ యొక్క ఆలోచనలను మీడియాతో పంచుకున్నారు. కరోనా దరిచేరకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు.

ఇప్పుడు దూరమే మంచిది
-పూజా హెగ్డే

పూజ హెగ్డే ప్రజలకు కరోనా రాకుండా ఉండేందుకు బేసిక్ పాయింట్స్ చెప్పారు.

తరచూ చేతులు శానిటైజ్ చేసుకోవాలి. ఫేస్‌ మాస్క్‌ని మరచిపోకుండా వాడాలి, వస్తువులను తాకినప్పుడు తప్పనిసరి శానిటైజ్ చేసుకోవాలి. బ్రీతింగ్ సమస్య రాకుండా ఉండాలంటే ఆవిరి పట్టడం చాలా ముఖ్యం. రోజుకి రెండుసార్లు ఆవిరి పడితే మంచిది. వేడినీళ్లు ఎన్ని తాగితే అంత మంచిది. మనం ఎక్కువ నీళ్లు తాగడంవల్ల మన శరీరంలో ఇన్ఫెక్షన్‌ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది.

యోగ చెయ్యడం చాలా మంచిది.. బ్రీతింగ్ యోగ వలన ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇక విటమిన్ సి కోసం నారింజ, బత్తాయి లాంటి సిట్రస్ ఫ్రూట్స్ తింటే మేలని.. లేదంటే విటమిన్ సి ట్యాబ్లేట్లు వాడాలని.. డాక్టర్ల సలహా మేరకు మెడిసిన్ తీసుకోవాలని తెలిపారు.

ఇక తన వ్యక్తిగతంగా పాటించే విషయాలను కూడా పంచుకున్నారు

షూటింగ్‌కి వెళ్లేటప్పుడు తప్పకుండా శానిటైజర్‌ తీసుకెళతాను. అలాగే అందరికీ దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. అది నాకూ మంచిది. లొకేషన్‌లో ఉండేవాళ్లకీ మంచిది షూటింగ్‌ లొకేషన్‌లో ఉన్నప్పుడు కాటన్‌ రుమాలుని మాస్క్‌లా వాడతాను. షూటింగ్ ముగించుకొని ఇంటికి రాగానే ఆవిరి పట్టుకుంటానని తెలిపారు.

ఆరోగ్యంగా ఉండాలి

-రాశీ ఖన్నా

లొకేషన్లో వీలున్న చోటల్లా శానిటైజర్లు ఏర్పాటు చేశారు. ఎంత చేసినా కెమెరా ముందుకు వెళితే మాస్క్ తీయాల్సిందే.. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే మొదటి నుంచి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతానను. కరోనా ముందు నుంచే వేడి నీళ్లు తాగడం అలవాటు.. మాంసాహారం తీసుకోవడం మానేశాను.. వెజిటేరియన్ ఫుడ్స్ కే పరిమితమైపోయాను.. ఇక ఈ సమయంలో ప్రతి ఒక్కరు తమ శారీరక దృడత్వంపై దృష్టిపెట్టాలి. మానసికంగా దైర్యంగా ఉండాలి.

శరీరం దృడంగా, మనసు ప్రశాంతంగా ఉంటే ఎటువంటి రోగాన్నైనా తగ్గించుకోవచ్చు. ఈ కరోనా వల్ల మనషుల మనుగడ ప్రశ్నార్థకం అయింది. ఈ పోటీ ప్రపంచంలో ఇన్నాళ్లూ పరుగులు పెట్టాం. ఇప్పుడు ఆగి, ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంపాదనలోనే ఆనందం ఉందనే భ్రమను తొలగించుకుందాం. ఆరోగ్యమే గొప్ప సంపద అనే విషయాన్ని గ్రహిద్దాం. కరోనా మానవ జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కరోనా కారణంగా కొన్ని పనులను ప్రజలు తమ నిత్యజీవితంలో భాగం చేసుకున్నారు.

ఆ ధోరణి మారాలి
-నభా నటేష్‌

కరోనా మహమ్మారితో బాధపడుతూ ఏడాది గడిపేశాం. అయినా కొందరు ఇంకా కరోనా జాగ్రత్తలు పాటించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీరి ఆలోచన ధోరణి మారాలి.. లేదంటే వీరితోపాటు ఇతరులు కూడా బాధపడాల్సి వస్తుందని నభా తెలిపారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి ప్రాథమిక నియమాలను అలవాటు చేసుకోవాలని అన్నారు. ఇక తన వ్యక్తిగత విషయాన్ని వస్తే.. కరోనా సమయంలోను షూటింగ్ లో పాల్గొంటున్నాను.

సరైన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే కెమెరా ముందుకు వెళ్తున్నాను. తన సిబ్బందిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తనదే అని, వారిలో ఎవరికీ కరోనా వచ్చినా తనకు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. షూటింగ్‌లో భాగంగా కొన్ని వస్తువులను తాకాల్సి వస్తుంది. సో.. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్‌తో క్లీన్‌ చేసుకుంటున్నాను. అందరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌష్ఠిక ఆహారం తీసుకోవాలని తెలిపారు.