India’s Biggest Film: బాహుబలి తర్వాత ఫీట్ సాధించిన తెలుగు సినిమా ‘పుష్ప’!

ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అన్న లైన్ ఈమధ్య బాగా ట్రెండ్ అవుతోంది. 2021లో పుష్ప ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచాక.. అందరూ అసలు ఎవరెవరు ఈ ఫీట్ సాదించారని సెర్చ్ చేస్తున్నారు

India’s Biggest Film: బాహుబలి తర్వాత ఫీట్ సాధించిన తెలుగు సినిమా ‘పుష్ప’!

India's Biggest Film

India’s Biggest Film: ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అన్న లైన్ ఈమధ్య బాగా ట్రెండ్ అవుతోంది. 2021లో పుష్ప ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచాక.. అందరూ అసలు ఎవరెవరు ఈ ఫీట్ సాదించారని సెర్చ్ చేస్తున్నారు. 2002 నుంచి ఓ అరడజను మందికి పైగా హీరోలు ఇలా నేషనల్ స్టార్ అనిపించుకున్నారు. 2021 బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన ఇండియన్ మూవీగా రికార్డ్ కెక్కింది పుష్ప. అదీ ఈ కొవిడ్ పరిస్థితుల్లో.

Rowdy Boys: లవ్, రొమాన్స్, కాలేజ్ ఫైట్స్.. ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్!

అయితే 2020లో తన్హాజీ ఈ ఫీట్ సాధించింది. అజయ్ దేవగణ్, ఓంరౌత్ కాంబోలో వచ్చిన తన్హాజీ 2020 బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. 2019లో హృతిక్ రోశన్ వార్ మూవీ హైయెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టి నంబర్ వన్ అనిపించుకుంది. హృతిక్ కి ఇలాంటి సక్సెస్ కొత్తేమి కాదు. 2006లో ధూమ్ 2, 2003లో కోయి మిల్ గయా సినిమాలు ఇలాంటి రికార్డునే బీట్ చేశాయి.

Crazy Combinations: కాంబో సెట్టయ్యిందా.. మళ్ళీ వాళ్ళతోనే మరో సినిమా!

అంతకుముందు 2018లో 2.0.. రజనీకాంత్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. రోబో సీక్వెల్ అన్న ట్యాగ్ లైన్ ఉండటం.. అక్షయ్ కుమార్ విలన్ గా నటించడం, శంకర్ డైరెక్షన్ పై నమ్మకం ఈ సినిమాకు హైయ్యెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చాయి. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అంటున్నారు కానీ రజనీకాంత్ అలా ఎప్పుడో పిలిపించుకున్నారు. 2010లో శంకర్ కాంబో మూవీ రోబో, మళ్లీ సేమ్ కాంబోలో వచ్చిన శివాజీ 2007లో ఇండియాస్ నంబర్ 1 సినిమాలుగా రికార్డ్స్ కెక్కాయి. 2005లో సూపర్ స్టార్ చంద్రముఖికి సైతం ఇండియన్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

Nidhhi Agerwal: తమిళ హీరోతో నిధి ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి?

2017లో రాజమౌళి బాహుబలి 2 ఇండియాస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. బాహుబలితో వచ్చిన క్రేజ్, ప్రభాస్ స్టార్ డం, రాజమౌళి ప్రమోషన్ మాయతో రికార్డులు కొల్లగొట్టింది బాహుబలి2. 2015లో బాహుబలి కూడా మంచి సక్సెస్ నే సాధించింది. 2016లో దంగల్ తో అమీర్ ఖాన్ సంచలనం సృష్టించాడు. హైయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాడు. 2014లో పీకే, 2013లో ధూమ్3, 2009లో 3 ఇడియట్స్, 2008లో గజిని నేషనల్ బ్లాక్ బ్లస్టర్స్ అనిపించుకున్నాయి. సల్మాన్, షారుఖ్ ఖాతాలో కూడా బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి. 2015లో భజరంగీ భాయిజాన్, 2012లో ఏక్తా టైగర్, 2011లో బాడీగార్డ్ మూవీస్ తో సల్మాన్ హిట్స్ కొట్టాడు. 2004లో వీర్ జారా, 2002లో దేవదాస్ సినిమాలు ఇలాంటి రికార్డ్ ను షారుఖ్ ఖాతాలో వేశాయి.