Telugu Movies: షూటింగ్ కంప్లీట్.. ఇక రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్!

చిరూ, చరణ్ కానిచ్చారు.. మహేశ్ బాబు పూర్తి చేశారు... రౌడీ బాయ్ రఫ్ఫాడించాడు.. షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు స్టార్స్. క్రేజీ సినిమాలు ఒక్కొక్కటిగా ఆడియెన్స్..

Telugu Movies: షూటింగ్ కంప్లీట్.. ఇక రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్!

Telugu Movies

Telugu Movies: చిరూ, చరణ్ కానిచ్చారు.. మహేశ్ బాబు పూర్తి చేశారు… రౌడీ బాయ్ రఫ్ఫాడించాడు.. షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు స్టార్స్. క్రేజీ సినిమాలు ఒక్కొక్కటిగా ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు ముస్తాబవుతున్నాయి. ఏ స్టార్ మూవీ ఏ స్టేజ్ లో ఉంది.. ఎప్పుడు రిలీజ్ కాబోతుందో ఓసారి చూద్దాం.

Acharya: హిందీలో ఆచార్య మెగాస్టార్.. బాలీవుడ్ నిర్మాతలతో సంప్రదింపులు?

షూటింగ్ కంప్లీట్ చేసుకుని, రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాల లిస్ట్ చాలానే ఉంది. ముఖ్యంగా వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన స్టార్ హీరోల సినిమాలు భారీ అంచనాలతో ఫాన్స్ ను ఊరిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతున్న లైగర్ షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా 60 కోట్ల బడ్జెట్ తో డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్న సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ పెంచిన ఈ సినిమా మే 12న థియేటర్లో కి రానుంది.

Sarkaru Vaari Paata: ఉగాది పర్వదినాన సర్కారు వారి పాట నుండి థర్డ్ సింగిల్?

ప్రభాస్ పాన్ ఇండియా మూవీ డైరెక్ట్ హిందీలో 500 కోట్ల బడ్జెట్ తో ఓమ్ రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుని, గ్రాఫిక్స్ వర్క్ లో బిజీగా ఉంటే, చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో 140 కోట్ల బడ్జెట్ తో కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 29న రిలీజ్ కాబోతుంది.

Liger: సోషల్ మీడియాను షేక్ చేసిన లైగర్.. అల్ ఇండియా రికార్డ్!

మాస్ రాజ రవితేజ శరత్ మండవ కాంబినేషన్ లో వస్తోన్న రామారావు ఆన్ డ్యూటీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్న ఈ సినిమా జూన్ 17న రిలీజ్ కానుంది. ఇంకా నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సినిమా అంటే సుందరానికి సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ హీరోగా లింగుస్వామి తెరకెక్కించిన ది వారియర్ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. జులై 14న ది వారియర్ రిలీజ్ కానుంది.