Telugu Movie Releases: బాక్సాపీస్ వద్ద కొత్త సినిమాల వాషౌట్.. ఆర్ఆర్ఆర్ ఎఫెక్టేనా?

వారం వారం కొత్త సినిమాలు థియేటర్లకు వస్తున్నాయ్ కానీ నిలబడడం లేదు. వచ్చిన సినిమా వచ్చినట్లే వారం తిరగకుండానే మాయమైపోతున్నాయ్. గత వారం వచ్చిన వరుణ్ తేజ్ గని, అంతకు ముందు వారం..

Telugu Movie Releases: బాక్సాపీస్ వద్ద కొత్త సినిమాల వాషౌట్.. ఆర్ఆర్ఆర్ ఎఫెక్టేనా?

Telugu Movie Releases

Telugu Movie Releases: వారం వారం కొత్త సినిమాలు థియేటర్లకు వస్తున్నాయ్ కానీ నిలబడడం లేదు. వచ్చిన సినిమా వచ్చినట్లే వారం తిరగకుండానే మాయమైపోతున్నాయ్. గత వారం వచ్చిన వరుణ్ తేజ్ గని, అంతకు ముందు వారం వచ్చిన తాప్సి మిషన్ ఇంపాజిబుల్ సినిమాలు బాక్సాపీస్ వద్ద అడ్రెస్స్ లేకుండా పోయాయి. ఇక అంతకు ముందొచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా మినహా అన్ని సినిమాలది ఇదే పరిస్థితి. మార్చి నెలలో రిలీజ్ అయిన వాటితో సహా ఆర్ఆర్ఆర్ మినహా ఒక్క సినిమా కూడా థియేటర్లలో నిలబడలేదు.

Telugu Movies Releases: సమ్మర్ లో హీటెక్కించబోతున్న సినిమా జాతర

మార్చి నెలలో వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్, స్టాండప్ రాహుల్, సూర్యా ఈటీ.. నుండి ఏప్రిల్ లో వచ్చిన ఏ సినిమాను ప్రేక్షకులు లెక్క చేయడం లేదు. అయితే.. ఇలా వచ్చిన సినిమాలన్నీ బాక్సాపీస్ వద్ద వాషౌట్ అయ్యేందుకు ఆర్ఆర్ఆర్ కూడా ఒక కారణమా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఆర్ఆర్ఆర్ ఓ భారీ వృక్షం. బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఆర్ఆర్ఆర్ అంతకు మించిన ప్రమోషన్లతో దేశవ్యాప్తంగా ఎక్కడలేని హైప్ క్రియేట్ చేసి థియేటర్లలో దిగింది. చిన్న చిన్న లోపాలున్నా అవేమీ లెక్కచేయకుండా ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమాకు బ్రహ్మరధం పట్టారు.

Movie Releases: స్టార్ హీరోల హవా.. చిన్న హీరోల టార్గెట్ ఈ రెండు నెలలే!

ఫలితంగా ట్రిపుల్ ఆర్ సినిమా రూ.వెయ్యి కోట్ల కలెక్షన్లు దాటి రెండు వేల కోట్లకు పరుగులు పెడుతుంది. సహజంగానే ఇలాంటి పూనకాలు తెప్పించే సినిమా థియేటర్లలో ఉండగా.. కొత్తగా వచ్చే సినిమాలు దాని ముందు నిలబడడం కష్టం. వచ్చే సినిమాలో ఎంతో స్టఫ్ ఉంటే తప్ప నిలబడలేదు. కానీ.. వచ్చే సినిమాలలో పస లేకపోవడంతో అసలు పట్టించుకోవడం లేదు ప్రేక్షకులు. అంతకు ముందు కలెక్షన్లలో దుమ్మురేపుతున్న కాశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా ఆర్ఆర్ఆర్ బరిలో దిగాక చతికిలా పడింది. అలాంటిది ఇక చిన్నా చితకా సినిమాల పరిస్థితి ఎలా ఉంటుంది?

Bollywood Movies: టార్గెట్ 2023.. వచ్చే ఏడాదే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్!

దీనికి తోడు ఈరోజుల్లో ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాకు ఓ మధ్య తరగతి కుటుంబం కలిసి వెళ్తే ఆ నెలలో మళ్ళీ మరో సినిమాకు డబ్బు ఖర్చు చేయడం గగనమే. అది కూడా కొత్త సినిమాలకు ఆదరణ లేకపోవడానికి మరొక కారణం. ట్రిపుల్ ఆర్ రిలీజ్ తర్వాత పరిస్థితి ఇలా ఉంటే.. రిలీజ్ కు ముందు కూడా దాని ప్రభావం కొంత కనిపించింది. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల చూపంతా ఆ సినిమా మీద ఉంటుంది తప్ప శర్వానంద్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోల సినిమా వైపు ప్రేక్షకులు చూడడం కష్టమే.

Telugu Movies: అన్ని ఎలిమెంట్స్ కాదు.. కొత్తగా కావాలంటున్న ప్రేక్షకులు!

దానికి తోడు ఈ సినిమాలకు నెగటివ్ టాక్ కూడా తోడవడంతో ఆర్ఆర్ఆర్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూపులతోనే అంతకు ముందు రెండు వారాల సినిమాలు కూడా వాషౌట్ అయిపోయినట్లు చెప్పుకోవాలి. మొత్తంగా చూస్తే.. బాక్సాపీస్ వద్ద కొత్త సినిమాలు బోల్తా కొట్టడంలో పూర్తిగా ఆర్ఆర్ఆర్ సినిమా కారణం అని చెప్పలేం కానీ.. ఆర్ఆర్ఆర్ కి వాటా మాత్రం తప్పక ఉంటుంది.