Telugu Movies: భారీ సినిమాల మధ్యలో ముద్దుగా వస్తున్న రొమాంటిక్ మూవీస్!

వందల కోట్ల బడ్జెట్, బాలీవుడ్-హాలీవుడ్ స్టార్ కాస్ట్, ఫారెన్ టెక్నీషియన్స్ తో భారీ యాక్షన్ సీన్స్, పాన్ ఇండియా రేంజ్ రిలీజ్.. ఇలా ఎక్కడ చూసినా అన్నీ భారీ.. అతి భారీ సినిమాలు..

Telugu Movies: భారీ సినిమాల మధ్యలో ముద్దుగా వస్తున్న రొమాంటిక్ మూవీస్!

Telugu Movies

Telugu Movies: వందల కోట్ల బడ్జెట్, బాలీవుడ్-హాలీవుడ్ స్టార్ కాస్ట్, ఫారెన్ టెక్నీషియన్స్ తో భారీ యాక్షన్ సీన్స్, పాన్ ఇండియా రేంజ్ రిలీజ్.. ఇలా ఎక్కడ చూసినా అన్నీ భారీ.. అతి భారీ సినిమాలు హడావిడి చేస్తుంటే.. సైలెంట్ గా, రొమాంటిక్ గా, స్క్రీన్ మీదకొస్తున్నాయి కొన్ని ఇంట్రస్టింగ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్. మరి పెద్ద సినిమాల మధ్యలో ముద్దుగా వస్తున్న రొమాంటిక్ మూవీస్ ఏంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

Telugu Movies: షూటింగ్ కంప్లీట్.. ఇక రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్!

టాలీవుడ్ స్టార్ హీరోలు మొత్తం టాలీవుడ్ మీద రిలీజ్ యుద్దం డిక్లేర్ చేశాయి. వరసగా భారీ మాస్ యాక్షన్ సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్అవుతున్నాయి. ఈ పెద్ద సినిమాల మధ్యలో క్యూట్ రొమాంటిక్ మూవీస్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. నిఖిల్, అనుపమపరమేశ్వరన్ జంటగా సుకుమార్ స్కూల్ నుంచి వస్తున్న మాంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 18 పేజెస్. కుమారి 24 ఎఫ్ డైరెక్టర్ విక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న 18 పేజెస్ నుంచి రిలీజ్ అయిన వీడియో ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేస్తోంది.

Telugu Movies : టాలీవుడ్‌పై బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ప్రశంసలు

సంతోష్ శోభన్, గౌరీ కిషన్ జంటగా తెరకెక్కుతున్న ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ.. శ్రీదేవి, శోభన్ బాబు. ఎటువంటి హడావిడి, ఆర్బాటాలు లేకుండా ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్షన్లో వస్తున్న ఈ యూత్ ఫుల్ క్రేజీ రొమాంటిక్ మూవీకి సంబంధించి స్టార్ హీరోయిన్ సమంత రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది.

Telugu Movies: అన్ని ఎలిమెంట్స్ కాదు.. కొత్తగా కావాలంటున్న ప్రేక్షకులు!

నాగశౌర్య ఈ మద్య యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. అయితే జస్ట్ ఫర్ ఎ ఛేంజ్.. కంప్లీట్ రొమాంటిక్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అనీష్ కృష్ణ డైరెక్షన్లో నాగశౌర్య, షెర్లీ జంటగా చేస్తున్న సినిమా కృష్ణ విృందా విహారి. ఈ నెలలోనే రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాతో మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఎక్స్ పీరియన్స్ సొంతం చేస్కోవచ్చంటున్నారు టీమ్.

Telugu Movies: ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్!

మాస్ కా దాస్ విష్వక్ సేన్.. యూత్ ని, ఫ్యామిలీస్ ని టార్గెట్ చేస్తున్నారు. రొటీన్ మాస్ సినిమాలు కాకుండా సెన్సిబుల్ ఫీల్ గుడ్ స్టోరీతో ధియేటర్లోకొస్తున్నారు. విష్వక్ సేన్, రుక్సర్ జంటగా ప్రేమ, పెళ్లి కాన్సెప్ట్ లో తెరకెక్కిన ఈసినిమా ఈ హాట్ సమ్మర్ లో కూల్ రొమాంటిక్ ఫీల్ ఇవ్వబోతోంది.

Telugu Star Heroes: అసలే సమ్మర్.. వెకేషన్ మూడ్‌లో తెలుగు హీరోలు!

కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి ఉప్పెన, కొండపొలం లాంటి ఇంటెన్స్ ఎమోషనల్ మూవీస్ చేసిన వైష్ణవ్ తేజ్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ చేస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్ గా గిరీశయ్య డైరెక్షన్లో తెరకెక్కుతున్న రంగరంగ వైభవంగా సినిమా యూత్ ని టార్గెట్ చేసుకుని వస్తోంది. ఈ సినిమా జులైలో రిలీజ్ అవుతోంది.