3 Years for Aha : టాక్ షోలో సరికొత్త సంచలనం సృష్టించిన ఆహా..

తెలుగు వారి ఓటిటిగా ప్రేక్షకుల ముందు వచ్చిన అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫార్మ్ ‘ఆహా’. అసలు ఆహా గురించి మాట్లాడుకోవాలి అంటే.. ముందుగా ప్రస్తావనకు వచ్చేది టాక్ షోలు. ఆహాలో ప్రసారమైన టాక్ షోలు ఒక సరికొత్త ఒరవడిని సృష్టించాయి. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆహా టాక్ షోలు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి.

3 Years for Aha : టాక్ షోలో సరికొత్త సంచలనం సృష్టించిన ఆహా..

aha talk shows

3 Years for Aha : తెలుగు వారి ఓటిటిగా ప్రేక్షకుల ముందు వచ్చిన అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫార్మ్ ‘ఆహా’. ఎంటర్టైన్మెంట్ అంటే వెండితెర పై సినిమాలు, బుల్లితెర పై సీరియల్స్ అండ్ స్పెషల్ ప్రోగ్రామ్స్ అని అనుకుంటున్న సమయంలో.. ఆడియన్స్ ముందుకు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలను తన కంటెంట్ తో సరికొత్త ఎంటర్టైన్మెంట్ ని ఆడియన్స్ కి అందించింది ఆహా. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాన్స్ అండ్ సింగింగ్ షోస్, వంట ప్రోగ్రామ్స్, టాక్ షోలు.. ఇలా ప్రేక్షకులు కోరుకొనే ప్రతి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ నెంబర్ వన్ ఓటిటి అనిపించుకుంది.

3 Years for Aha : ఓటిటి ప్రపంచంలో తెలుగు ప్రభంజనం ఆహా.. మూడవ వార్షికోత్సవం!

అసలు ఆహా గురించి మాట్లాడుకోవాలి అంటే.. ముందుగా ప్రస్తావనకు వచ్చేది టాక్ షోలు. ఆహాలో ప్రసారమైన టాక్ షోలు ఒక సరికొత్త ఒరవడిని సృష్టించాయి. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆహా టాక్ షోలు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా చేసిన ‘సామ్ జామ్’ టాక్ షోకి విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, చిరంజీవి వంటి స్టార్స్ రావడంతో సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ తరువాత మరి కొంత డోస్ పెంచుతూ ఎవరు ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణతో ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోని అనౌన్స్ చేశారు.

అసలు బాలయ్య టాక్ షో హోస్ట్ గా చేయడం ఏంటని? అది ఎలా ఉండబోతుందని? ప్రేక్షకులు ఎగబడేలా చేశారు ఆహా టీం. ఇక ఆ షో మొదలైన తరువాత అన్‌స్టాపబుల్ గా దూసుకుపోతుంది. సినీ, రాజకీయ రంగంలో నుంచి స్టార్ పర్సన్స్ ని తీసుకు వచ్చి, వారి జీవితంలోని కొన్ని తెలియని విషయాలను బాలయ్య బయటపెడుతున్న విధానం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్.. ఇలా స్టార్స్ ని తీసుకు వచ్చి టాక్ షోస్ లో రికార్డులు సృష్టిస్తుంది. ఇటీవల ప్రభాస్, పవన్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్స్ తో అయితే ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ అనిపించుకుంది.

ఈ టాక్ షోస్ తో పాటు వైవా హర్షతో ‘తమాషా విత్ హర్ష’ అనే ఒక టాక్ షోని కూడా చేశారు. అలాగే యాంకర్ శ్రీముఖి, మంచు లక్ష్మితో కుకింగ్ షోస్. అనిల్ రావిపూడి వంటి స్టార్ డైరెక్టర్ తో కామెడీ షో, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో ఇండియన్ ఐడల్, శేఖర్ మాస్టర్ తో డాన్స్ ఐకాన్ షోలు రన్ చేస్తూ, అలరిస్తూ వస్తుంది.