3 Years for Aha : కరోనా వచ్చిన తరువాత దేశంలో వచ్చిన అతిపెద్ద మార్పు.. సినీ ప్రేక్షకులు ఓటిటిలకు బాగా ఎడిక్ట్ అవ్వడం. లాక్ డౌన్ సమయంలో సినిమాలు, టీవీ షోలు అన్ని ఆగిపోవడంతో.. ఇంటిలో కాలిగా ఉన్న ప్రేక్షకులు ఓటిటిలకు అలవాటు పడ్డారు. లాక్ డౌన్ అంతా ఇతర భాషల్లోని సినిమాలు, వెబ్ సిరీస్ లు వరుసపెట్టి చూసేశారు మూవీ లవర్స్. నిజానికి ఇండస్ట్రీల మధ్య సరిహద్దులు చెరిపేసింది బాహుబలి, RRR, కేజీఎఫ్ సినిమాలు కాదు, ఈ ఓటిటిలనే చెప్పాలి. ఓటిటి వలనే ఇతర భాషల సినిమాల పై ఆడియన్స్ కి ఆసక్తి కలిగింది. దాని వల్లే నేడు పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయ్యింది.
Unstoppable : పవన్ అన్స్టాపబుల్ 2 ప్రోమో.. పక్కా పొలిటికల్ ఎపిసోడ్.. ఏపీలో పొలిటికల్ హీట్ ఖాయం..
ఈ క్రమంలోనే తెలుగు ఓటిటిగా ప్రేక్షకుల ముందు వచ్చిన ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫార్మ్ ‘ఆహా’. 2020లో మొదలైన ఆహా తెలుగు వారికి ఎంతో దగ్గరైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆదరణ పొందింది. టాక్ షోలు, వంట ప్రోగ్రామ్స్, డాన్స్ అండ్ సింగింగ్ షోస్, సినిమాలు, సిరీస్ ఇలా అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే అన్స్టాపబుల్, సామ్ జామ్, తమాషా విత్ హర్ష, నెంబర్ వన్ యారి, చెఫ్ మంత్రా, ఇండియన్ ఐడల్, డాన్స్ ఐకాన్, కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ మంచి రీచ్ ని సొంతం చేసుకున్నాయి.
అయితే ప్రేక్షకులను కేవలం ఎంటర్టైన్ చేయడమే కాదు, టాలెంట్ ఉండి నిరూపించుకోడానికి అవకాశం దొరకని ఎంతోమంది కళాకారులు, సాంకేత నిపుణలకు అవకాశం కూడా కలిపిస్తూ వస్తుంది మన తెలుగు ఓటిటి ఆహా. ఓటిటి ప్రపంచంలో ప్రభంజనం సృష్టించిన ఈ తెలుగు ఓటిటి ప్లాట్ఫార్మ్ ‘ఆహా’ నేటితో (ఫిబ్రవరి 8) మూడవ వార్షికోత్సవం పూర్తి చేసుకొంది. దీంతో ప్రేక్షాభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది ఆహా టీం. కాగా ఇటీవలే ఈ తెలుగు ఓటిటి ఆహా.. తమిళంలో సైతం మొదలైంది. అక్కడ కూడా అదిరిపోయే రీచ్ ని సొంతం చేసుకొని, ఇతర భాషల్లో కూడా అడుగుపెట్టేలా ముందుకు దూసుకు పోతుంది.
Meeru abhimaninche herolu, meeru mecche shows, meeku nacche movies, 100% Telugu lo mee mundhuki theeskochi 3 years authundhi.
Together, let’s celebrate #3BlockbusterYearsOfAHA ? pic.twitter.com/i4j8HNTfNH— ahavideoin (@ahavideoIN) February 7, 2023