UnStoppable NBK: తెలుగువారు గర్వించదగిన ఓటీటీ ”ఆహా” -నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో తెరకెక్కిన సరికొత్త టాక్ షో నవంబర్ 4వ తేదీన ప్రసారం కానుంది.

UnStoppable NBK:  తెలుగువారు గర్వించదగిన ఓటీటీ ”ఆహా” -నందమూరి బాలకృష్ణ

Bala Krishna

UnStoppable NBK: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో తెరకెక్కిన సరికొత్త టాక్ షో నవంబర్ 4వ తేదీన ప్రసారం కానుంది. ఈ ఓటీటీ ఒరిజినల్‌కు సంబంధించిన లాంచింగ్ వేడుక దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నొవాటెల్ హోటల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి నటసింహం బాలకృష్ణ మొట్టమొదటిసారి హోస్ట్ చేస్తుండగా.. ఈ షోకి సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకున్నారు.

రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. ప్రతి మనిషి జీవితంలోనూ ఎత్తు పల్లాలు ఉంటాయని, వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరడమే ‘అన్‌స్టాపబుల్‌’ అని అన్నారు బాలకృష్ణ. సాంఘికం, జానపదం, సోషియో ఫాంటసీ, కుటుంబ కథాచిత్రాల్లో వివిధ పాత్రలు నటించాను. మీ అంతులేని ప్రేమతో నన్ను ఆదరిస్తూ అక్కున చేర్చుకున్నారు. ఇంకా ఎంతో చెయ్యాలనే ఉత్సాహాన్ని తెలుగువారి అభిమానమే నాకు ఇస్తుంది.

‘ఆహా’ ఓటీటీ అల్లు అరవింద్‌ మానస పుత్రిక. ఎన్నో ఓటీటీలు ఉన్నా కూడా అల్లూ అరవింద్ గారు వాటికి దీటుగా ఈ ఓటీటీని స్థాపించారు. తెలుగువారు గర్వించదగిన రీతిలో ముందుకు సాగుతున్న ఆహా టీవీ ఇంకా ఎంతో ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. భావిలో కప్పలా ఉండకుండా.. బయటపడినప్పుడే మనిషి ఆవిష్కరించబడుతాడు.

అటువంటి ఆవిష్కరణే అన్ స్టాపబుల్ అన్నారు బాలకృష్ణ. అన్ స్టాపబుల్.. ”వచ్చిన వారికి గౌరవం ఇస్తూ.. గౌరవిస్తూ.. బలవంతంగా నెట్టకుండా.. బాధపెట్టకుండా కొన్నిసార్లు నటిస్తూ.. మెప్పిస్తూ.. ఈ కార్యక్రమం చెయ్యాలని భావిస్తున్నాను. అన్ స్టాపబుల్.. కలుద్దాం.. ఆహాలో..” అంటూ ఎనర్జిటిక్‌గా బాలకృష్ణ మాట్లాడారు.