కెవ్వు కేక : డాన్స్ తో అద్దరగొట్టిన గ్లామర్ మమ్మీ

  • Published By: madhu ,Published On : July 23, 2020 / 10:49 AM IST
కెవ్వు కేక : డాన్స్  తో అద్దరగొట్టిన గ్లామర్ మమ్మీ

టాలీవుడ్ లో సీనియర్ నటిగా గుర్తింపు పొందిన నటీమణుల్లో ప్రగతి ఒకరు. ఈమెకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మొన్నటి మొన్న తీన్మార్ స్టెప్పులు, జిమ్ వర్కౌట్స్ తో కేక పుట్టించిన ఈ నటి..తాజాగా మరోసారి డ్యాన్స్ తో దుమ్మురేపింది.

ఈమె చేసిన డ్యాన్స్ కు ఫిదా అయిపోతున్నారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసిన ఈ వీడియో తెగ వైరల్ అయిపోతోంది. ఓ అద్దం ముందు నిలబడిన ప్రగతి మెల్లిగా నడుం ఊపడం ప్రారంభించింది. బ్యాంక్ గ్రౌండ్ మ్యూజిక్ మెల్లిగా వస్తోంది.

‘అది అరబిక్ కడలందం తడి తళుకే కన్నాలే చెలి ఆట తళుక్కు లేత వనుక్కు కౌగిళ్ళడిగానే హమ్మా హమ్మా’ అనే సాంగ్ కు ప్రగతి డ్యాన్స్ చేసింది. ఇంత లేటు వయస్సులో కూడా ఈమె చేసిన డ్యాన్స్ ఫెర్మామెన్స్ కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. మ్యూజిక్ అనుగుణంగా శరీరాన్ని ఊపుతూ అదరగొట్టింది ప్రగతి.

టాలీవుడ్ లో సీనియర్ నటులు తమ ఫెర్మామెన్స్ తో అభిమానులను పిచ్చెక్కిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లు బంద్ అయిపోయాయి. హీరోలు, హీరోయిన్స్, ఇతర నటులు అందరూ ఇంటికే పరిమితం అయిపోయారు. తమలో ఉన్న టాలెంట్ ను బయటకు తీసి..వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

సీనియర్ నటి ‘ప్రగతి’ తల్లిగా, వదినగా, పిన్నిగా అనేక క్యారెక్టర్స్ లలో అలరించారు. ఈమె లేటెస్ట్ గా పోస్టు చేసిన వీడియో.. వయసుదేముంది.. రిథమ్ ఉండాలి కానీ, అనేట్లు ఉంది. తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేసి.. తనకంటూ స్పెషాలిటీ సంపాదించుకున్నారు ప్రగతి.

View this post on Instagram

 

Chin up… you are not struggling, you are in midst of conquering ???

A post shared by Pragathi Mahavadi (@pragstrong) on