Telugu Senior hero’s: సస్పెన్స్‌లో సీనియర్ హీరోలు.. రిలీజ్ ఎప్పుడో?!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎటు చూసినా హడావుడి కనిపిస్తుంది. ఒకపక్క సినిమాలు రిలీజ్ అవుతుంటే.. కొత్త సినిమాలు కొబ్బరి కాయ కొట్టేస్తున్నాయి. పెద్ద సినిమాల దగ్గరనుంచి చిన్న..

Telugu Senior hero’s: సస్పెన్స్‌లో సీనియర్ హీరోలు.. రిలీజ్ ఎప్పుడో?!

Telugu Senior Hero's

Telugu Senior hero’s: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎటు చూసినా హడావుడి కనిపిస్తుంది. ఒకపక్క సినిమాలు రిలీజ్ అవుతుంటే.. కొత్త సినిమాలు కొబ్బరి కాయ కొట్టేస్తున్నాయి. పెద్ద సినిమాల దగ్గరనుంచి చిన్న సినిమాల వరకూ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి టైమ్ చూసుకుని ధియేటర్లోకి వస్తున్నాయి. కానీ వెంకటేష్, బాలకృష్ణ, రవితేజ, రానా నాగార్జున మాత్రం ఇంకా తమ సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చెయ్యకుండా సస్పెన్స్ లో ఉన్నారు. వాళ్ళ అభిమానులేమో మన సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

Hari Hara Veera Mallu: పవన్ రాక మరింత ఆలస్యం.. కారణం ఏంటంటే?

లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చెయ్యడమే కాకుండా టైమ్ చూసుకుని థియేటర్లోకి వచ్చేస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం అసలు రిలీజ్ డేట్ మర్చిపోయారా.. లేక ఇంకా సస్పెన్స్ లో పెడుతున్నారా అంటూ ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. వాటిలో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ మూవీ కూడా ఉంది. షూటింగ్ అయిపోయి చాలా కాలం అయినా ఇంకా సినిమా రిలీజ్ మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు టీమ్.

Telugu Young Hero’s: ఒక్క బ్రేక్.. ఒక్క హిట్టు కావాలి ప్లీజ్!

మరో సీనియర్ హీరో వెంకటేష్ కూడా అప్పుడెప్పుడో లాక్ డౌన్ లోనే నెల రోజుల్లోనే సినిమాని కంప్లీట్ చేసి కూడా ఇంకా సినిమా రిలీజ్ మీద క్లారిటీ ఇవ్వలేదు. దృశ్యంకి రీమేక్ గా వస్తున్న దృశ్యం 2 లాక్ డౌన్ టైమ్ లోకంప్లీట్ చేశారు. కానీ రిలీజ్ మాత్రం ఫిక్స్ చెయ్యలేదు. నాగార్జున ఘోస్ట్ మూవీ కూడా అంతే ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఘోస్ట్ మూవీ రిలీజ్ డేట్ కూడా ఇంకా నానుస్తూనే ఉన్నారు టీమ్.

Bigg Boss 5: దారుణంగా పడిపోతున్న రేటింగ్.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఎప్పుడో?

అసలు ఈ సినిమాలకన్నా.. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన రానా విరాటపర్వం సినిమా ఇంకా రిలీజ్ కు నోచుకోవడం లేదు. ఇప్పటికి 3 సార్లు రిలీజ్ ఫిక్స్ చేసినా ఏదోక రీజన్ తో సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. షూటింగ్ ఎప్పుడో అయిపోయినా, రిలీజ్ కు రెడీగా ఉన్నా.. ఇంకా సినిమా రిలీజ్ మీద మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు మేకర్స్.

Radhe Shyam: ఇంగ్లీష్‌లో రాధేశ్యామ్ టీజర్.. గ్లోబల్ ప్రమోషన్ స్టార్ట్!

వరుసగా సినిమాలు చేస్తున్న రవితేజ ఖిలాడి మూవీ ఎప్పుడొస్తుందో మాత్రం చెప్పడం లేదు. హై యాక్షన్ సీన్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమా రమేష్ వర్మ డైరెక్షన్లో వస్తోంది. రవితేజ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా.. ఖిలాడి యూనిట్ ఇంకా రిలీజ్ టైమ్ మాత్రం డిక్లేర్ చెయ్యలేదు.