Telugu Small Movies: రిలీజ్ కష్టాలు.. చిన్న సినిమాలకు పెద్ద చిక్కులు!

వెయిట్ చేసే అవసరం లేకుండా.. పెద్ద హీరోల సినిమాలన్ని బ్యాక్ టూ బ్యాక్ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు కానీ.. పెద్ద సినిమాల దండయాత్రతో చిన్న సినిమాలకు భయం..

Telugu Small Movies: వెయిట్ చేసే అవసరం లేకుండా.. పెద్ద హీరోల సినిమాలన్ని బ్యాక్ టూ బ్యాక్ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు కానీ.. పెద్ద సినిమాల దండయాత్రతో చిన్న సినిమాలకు భయం చుట్టుకుంది. ఎక్కడ మళ్లీ పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుందోననే టెన్షన్ పట్టుకుందట. ఎంకి పెళ్లి సుబ్బి చాపుకొచ్చింది అన్నట్టు తయారైంది కొన్ని సినిమాల పరిస్థితి. ఆల్రెడీ సమ్మర్లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న చిన్న సినిమాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.

Unstoppable with NBK: మాన్ ఆఫ్ మాసెస్.. రియలిస్టిక్ బిహేవియర్.. అందుకే హిట్!

ఆచార్య, త్రిబుల్ ఆర్, కేజిఎఫ్ 2, రాధే శ్యామ్ వంటి భారీ బడ్జెట్, భారీ తారాగణంతో వచ్చిన సినిమాల పోస్ట్ పోన్.. కేవలం ఆ సినిమాల ప్రొడ్యూసర్లకే కాదు, చిన్న సినిమాల హీరోలకు, ప్రొడ్యూసర్లకూ భారీ నష్టాన్నే మిగుల్చనుంది. అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయకుంటే భారీగా నష్టపోపోతారు చిన్న సినిమాల నిర్మాతలు. ఆ టైమ్ కు రిలీజ్ చేయాలంటే, బిగ్ స్టార్స్ దాటికి నిలబడతామో లేదో అనే అనుమానం. అసలు థియేటర్లు దొరుకుతాయా? అనే సందేహం.

Devi Sri Prasad: రఫ్పాడిస్తున్న రాక్ స్టార్.. డిఎస్పి బౌన్స్ బ్యాక్ అయినట్లేనా?

మార్చి 18న గోపిచంద్ పక్కా కమర్షియల్, వరుణ్ తేజ్ గని, రామ్ ది వారియర్ సినిమాలు పోటీపడనున్నాయి. ఇదే డేట్ త్రిబుల్ ఆర్ తో పాటు డార్లింగ్ ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఈ నెలలో అల్లరి నరేష్ సభకు నమస్కారం, ఆది సాయికుమార్ తీస్మార్ ఖాన్ వంటి చిన్న సినిమాలూ ఉన్నాయి. మళ్లీ వాయిదా డేట్స్ అడ్జెస్ట్ చేసుకోవడం మీద కసరత్తులు చేసే వాళ్లు కొందరైతే ఏదైతే అదైందని రిలీజ్ చేసేవాళ్లు కొందరున్నారు.

Summer Releases: స్టార్లంతా సమ్మర్ బరిలోనే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా!

ఆ తర్వాత ఏప్రిల్ 29న వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఎఫ్ 3, నితిన్ హీరోగా చేస్తున్న మాచర్ల నియోజకవర్గం, పవన్, క్రిష్ కాంబోలో తెరకెక్కుతోన్న హరి హర వీరమల్లు మూడు సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. కుదిరితే మార్చి 18న, లేదంటే ఏప్రిల్ 28న త్రిబుల్ ఆర్ రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నాడు జక్కన్న ఇలా మేకింగ్ పూర్తి చేసుకున్న పెద్ద సినిమాలన్ని కోవిడ్ కంట్రోల్ అయితే రిలీజ్ చేసి, క్యాష్ చేసుకోవాలని వెయిట్ చేస్తుంటే, వాటి ఎఫెక్ట్ ఆయా డేట్ల లో రిలీజ్ చేసేందుకు రెడీ చేసుకున్న చిన్న సినిమాల మీద ఖచ్చితంగా ఉంటుందటుంది. ఈ ఇయర్లో కోవిడ్ కంట్రోల్ లో కొచ్చి, కొన్ని సినిమాలకైనా విముక్తి కలుగుతుందేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు