Telugu Star Hero’s: మూడు పాటలు.. ఆరు స్టెప్పులతో మన స్టార్స్!

అనౌన్స్ చేసిన టైమ్ కి సినిమాలు రిలీజ్ చెయ్యడానికి నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు స్టార్లు. అటు యాక్షన్, ఇటు ఫైట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న స్టార్లు.. ఇప్పుడు స్టెప్పులేస్తున్నారు.

10TV Telugu News

Telugu Star Hero’s: అనౌన్స్ చేసిన టైమ్ కి సినిమాలు రిలీజ్ చెయ్యడానికి నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు స్టార్లు. అటు యాక్షన్, ఇటు ఫైట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న స్టార్లు.. ఇప్పుడు స్టెప్పులేస్తున్నారు. స్టార్ హీరో మహేష్ బాబు నుంచి కొత్త సినిమా స్టార్ట్ చేసిన చరణ్ వరకూ హీరోలందరూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

Liger: ఎన్సీబీ కంట్రోల్‌లో అనన్య.. లైగర్‌కు సెగ తప్పదా?

మొన్న మొన్నటి వరకూ యాక్షన్ తో బిజీగా ఉన్న స్టార్లు.. కాస్త రిలాక్స్ అయ్యి సాంగ్స్ షూటింగ్ స్టార్ట్ చేశారు. లేటెస్ట్ గా రవితేజ స్టెప్పులేసే పనిలో బిజీగా ఉన్నారు. రమేష్ వర్మ డైరెక్షన్లో రవితేజ, మీనాక్షి, డింపుల్ హయాతి జంటగా తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాకు సంబందించి మాంచి పెప్పీ నంబర్ షూట్ చేస్తున్నారు. మాస్ మహారాజా ఈజ్ కి తగినట్టు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో పాటు అప్ కమింగ్ కొరియోగ్రాఫర్ యష్ క్రేజీ స్టెప్స్ తో సాంగ్ చేస్తున్నారు రవితేజ.

Nagarjuna: ఫుల్ జోష్‌లో నాగ్.. బ్యాచిలర్ టీమ్‌కు సక్సెస్ పార్టీ!

స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఇన్వెస్టిగేటివ్ డ్రామా బ్యాక్ డ్రాప్ తో కొత్త సినిమా స్టార్ట్ చేసిన రామ్ చరణ్ కూడా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ని పాటతోనే స్టార్ట్ చెయ్యాలని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. పూణె, లోనావాలా ఏరియాల్లో షూటింగ్ ప్లాన్ చేసుకున్న చరణ్, శంకర్ అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ లో సాంగ్ షూట్ ప్లాన్ చేసుకున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రామ్ చరణ్ కు జంటగా కియారా నటిస్తోంది.

Riya Sen: ఈ బికినీ బేబీ సంపదకి సోషల్ మీడియా షేక్!

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సాంగ్ షూట్ కోసం స్పెయిన్ వెళ్లారు. బార్సిలోనాలోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో అదిరిపోయే సాంగ్ షూటింగ్ లో ఉన్నారు మహేష్. పరశురామ్ డైరెక్షన్లో మహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వీళ్లిద్దరి మద్య మంచి లవ్ నంబర్ సాంగ్ ని స్పెయిన్ లో షూట్ చేస్తున్నారు టీమ్. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి థమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ నుంచి చిన్న బిట్స్ రిలీజ్ చేస్తూ.. సినిమా మీద హైప్స్ పెంచేస్తున్నారు.

Priyanka Jawalkar: చూడచక్కని రూపం.. సొగసు మందారం!

ఈ మధ్య సినిమాల విషయంలో ఎక్స్ పెరిమెంట్స్ బాగా చేస్తున్న నాని కూడా బ్యాక్ టూ బ్యాక్ షూట్స్ నుంచి సాంగ్ కి షిఫ్ట్ అయ్యారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో నాని హీరోగా చేస్తున్న అంటే సుందరానికి సినిమాకు సంబందించి సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో నానికి హీరోయిన్ గా నజ్రియా నజిమ్ నటిస్తోంది.