Film Promotions: ప్రమోషన్లతో మోత మోగించేస్తున్న స్టార్ మూవీస్

ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తం పాటలోనే ఉందన్న రాజమౌళి, సిద్దను చూడడానికి రెడీ అవ్వమంటున్న ఆచార్య, రీల్స్ తో రెడీగా ఉండమంటున్న ప్రబాస్, కృతి శెట్టితో లవ్ స్టోరీ చెబుతున్న నాని,

10TV Telugu News

Film Promotions: ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తం పాటలోనే ఉందన్న రాజమౌళి, సిద్దను చూడడానికి రెడీ అవ్వమంటున్న ఆచార్య, రీల్స్ తో రెడీగా ఉండమంటున్న ప్రబాస్, కృతి శెట్టితో లవ్ స్టోరీ చెబుతున్న నాని, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెడీ అవుతున్న బాలయ్య, ఇలా ప్రమోషన్లతో మోత మోగించేస్తున్నారు స్టార్ మూవీస్ మేకర్స్. ధియేటర్లు కళకళలాడబోతున్నాయి.. వరుసగా పెద్ద సినిమాల రిలీజ్ లతో పండగ చేసుకోబోతున్నారు జనాలు . ధియేటర్లో ఈ హడావిడి స్టార్ట్ అవ్వకముందే.. ప్రమోషన్స్ తో తెగ సందడి చేస్తున్నాయి సినిమాలు. బ్యాక్ టూ బ్యాక్ సాంగ్ రిలీజ్ లు, రిలీజ్ ఈవెంట్స్, ట్రైలర్ లాంచ్ అనౌన్స్ మెంట్స్ తో మాంచి ప్రమోషన్ మూడ్ లో ఉన్నారు.

RRR: విజువల్ ట్రీట్.. హాట్ టాపిక్‌గా మారిన రన్ టైం..!

లేటెస్ట్ గా ట్రిపుల్ ఆర్ కి సంబందించి రాజమౌళి ఫుల్ హడావిడి చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ మూవీలో శుక్రవారం రిలీజ్ అవుతున్న పాట మీద స్పెషల్ గా ప్రెస్ మీట్ పెట్టిమరీ సినిమా గురించి మాట్లాడారు జక్కన్న. అంతే కాదు సినిమా ట్రైలర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే రిలీజ్ అవుతుందని హింట్ కూడా ఇచ్చారు. చరణ్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో భారీ బడ్జెట్ తో పాటు భారీ స్కేల్ లో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ కు సంబందించి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు టీమ్. కీరవాణి రాసి పాడిన జనని పాట ఈ నెల 26న రిలీజ్ అవుతున్న జనని సాంగ్ సినిమాకు చాలా స్పెషల్ అంటున్నారు రాజమౌళి. సినిమాలో ఎన్ని ఎమోషన్స్ ఉన్నా.. స్టోరీకి ఉన్న కోర్ ఎమోషన్ తో సినిమా మొత్తం కంటిన్యూ అయ్యే పాట జనని అని సాంగ్ మీద హైప్స్ పెంచారు స్టార్ డైరెక్టర్.

Akhanda: ఎన్నో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్‌తో అఖండ!

లేట్ అయినా కూడా ప్రమోషన్ల విషయంలో ఫుల్ బజ్ క్రియేట్ చేస్తోంది అఖండ సినిమా. బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న అఖండ మూవీ రిలీజ్ చేసిన ప్రతి మూవీతో సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 27న ప్లాన్ చెయ్యడంతో.. ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ అయినా సరే.. ఇప్పటినుంచే హడావిడి చేస్తున్న సినిమా ఆచార్య. చిరంజీవి, చరణ్ లీడ్ రోల్స్ లో కొరటాల డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్యకు సంబందించి ఇప్పటికే చిరంజీవి టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్ గా సిద్ద క్యారెక్టర్ చేస్తున్న చరణ్ కు సంబందించి టీజర్ ని ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసి ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది.

Pushpa: బన్నీ మాసీనెస్.. ఫ్యాన్స్‌ని ఎలా ఎంగేజ్ చేయబోతున్నాడు?

ప్రమోషన్ల విషయంలో దడదడలాడించేస్తున్న సినిమా పుష్ప. నెవర్ బిఫోర్ లుక్ తో బన్నీ-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప మూవీ డిసెంబర్ 17న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు సంబందించి సాంగ్స్ తో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన టీమ్.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని డిసెంబర్ 12న ప్లాన్ చేస్తున్నారు టీమ్. సంక్రాంతి రిలీజ్ కు రెడీగా ఉన్న రాధేశ్యామ్ కూడా ఇప్పుడిప్పుడే ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది. మొన్నామధ్య ఈ రాతలే అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన రాధేశ్యామ్.. లేటెస్ట్ గా ఈ పాటకు సంబందించి రీల్స్ కాంటెస్ట్ తో ప్రమోషన్ల జోరు పెంచింది. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సౌత్, నార్త్ సెపరేట్ సెపరేట్ గా జరుగుతున్నట్టు టాలీవుడ్ లో న్యూస్ వినిపిస్తోంది.

Acharya: మెగా మేనియా.. రికార్డ్ ధరకు డబ్బింగ్ రైట్స్!