Telugu Young Heros: యాక్షన్ మీద మోజు పడుతున్న రొమాంటిక్ హీరోలు

రొమాన్స్ , లవ్ బోర్ కొట్టేసిందంటున్నారు హీరోలు. మొన్న మొన్నటి వరకూ క్యూట్ గా స్వీట్ గా కనిపించిన ఈ హీరోలు ఇప్పుడు యాక్షన్ మీద మోజు పడుతున్నారు.

Telugu Young Heros: యాక్షన్ మీద మోజు పడుతున్న రొమాంటిక్ హీరోలు

Telugu Young Heros

Telugu Young Heros: రొమాన్స్ , లవ్ బోర్ కొట్టేసిందంటున్నారు హీరోలు. మొన్న మొన్నటి వరకూ క్యూట్ గా స్వీట్ గా కనిపించిన ఈ హీరోలు ఇప్పుడు యాక్షన్ మీద మోజు పడుతున్నారు. అందుకే రొమాన్స్ నుంచి యాక్షన్ టర్న్ తీసుకుంన్నారు. స్పెషల్లీ నితిన్ ఈ మధ్య డిఫరెంట్ మూవీస్ చేస్తూ.. సడెన్ గా యాక్షన్ టర్న్ అయ్యారు. మ్యాస్ట్రో రిలీజ్ కు రెడీ అవుతున్న నితిన్ కొత్త డైరెక్టర్ తో మాచర్ల నియోజకవర్గం అనే ఇంట్రస్టింగ్ మూవీ చేస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో అగ్రెసివ్ తో కనిపిస్తున్నారు నితిన్.

Rajinikanth: మళ్ళీ మాస్ యాంగిల్ మీదే ఫోకస్ చేసిన రజనీ

ఇప్పటి వరకూ బాయ్ నెక్ట్స్ డోర్ సినిమాలు చేసి ఆడియన్స్ కి దగ్గరైన నాని ..రీసెంట్ గా రిలీజ్ అయిన టక్ జగదీష్ లో యాక్షన్ చేసి చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నా కూడా యాక్షన్ కంటెంట్ కూడా ఎక్కువే చేశారు నాని. అక్కినేని హీరో అఖిల్ కూడా సురేందర్ రెడ్డితో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాలో కంప్లీట్ యాక్షన్ యాంగిల్ చూపించబోతున్నారు. ఇక యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా యాక్షన్ టర్న్ తీసుకున్నారు. తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్లో కృతి శెట్టి హీరోయిన్ గా తెరకక్కుతున్న సినిమాలో రామ్ యాక్షన్ కాస్త ఎక్కువే.

Cinema Folk Songs: వెండితెరపై మోత మోగిస్తున్న జానపదం!

మరో యంగ్ హీరో కార్తికేయ కూడా యాక్షన్ మీద మోజు పెంచుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఏదో రొటీన్ ఫ్యామిలీ, రొమాంటిక్ మూవీస్ చేసిన కార్తికేయ .. రాజావిక్రమార్క అనే డిఫరెంట్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఫుల్ యాక్షన్ చేస్తున్నారు కార్తికేయ. వీరే కాదు.. శర్వానంద్ కూడా శ్రీకారం, జాను లాంటి సినిమాల నుండి ఒక్కసారిగా సిద్దార్ధ్ తో కలిసి ‘మహాసముద్రం’తో ఫైటింగ్ కి సిద్దమయ్యాడు.