అమెజాన్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్….బెస్ట్ యాక్షన్, థ్రిలర్స్

  • Published By: veegamteam ,Published On : April 8, 2020 / 09:44 AM IST
అమెజాన్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్….బెస్ట్ యాక్షన్, థ్రిలర్స్

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి పేరు వినబడితే చాలు ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. భారతదేశంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. దాంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉండి సమయాన్ని గడపాటానికి కొంతమంది ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లను ఎంచుకుంటారు. అలాంటి వారి కోసం యాక్షన్ థ్రిల్లర్, క్రైమ్ వంటి కొన్ని టివి సిరీస్ లు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్లలో ప్రసారమయ్యే కొన్నింటిని గురించి తెలుసుకుందాం…

Hap and Leonard

hap
హాప్ , లియోనార్డ్ అనేది అమెరికన్ టెలివిజన్ డ్రామా సిరీస్.ఇవి మూడు సీజన్లు ఉంటాయి. ఒక్క సీజన్ కి ఆరు ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ నాటిక సాధారణ బడ్డీ అడ్వెంబర్ ట్రోప్ ను అణచివేయటం జరుగుతుంది. ది వైర్ యెుక్క మైఖేల్ కెన్నెత్ విలియమ్స్, జేమ్స్ ప్యూర్ ఫోయ్ తో కలిసి పని చేయటంతో మెుదలౌవుతుంది. ఇది పూర్తిగా హెటెరోనార్మేటివ్ స్టీరియోటైప్ లను ట్విస్ట్ చేయటం, స్నేహం గురించి ఉంటుంది. ఈ శీర్షిక ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ లో ఉంది.
 
Alone Together

alone
అలోన్ టుగెదర్ అనేది బెంజి అఫ్లాలో , ఎస్తేర్ పోవిట్స్ కీ నిర్మించిన అమెరికన్ కామెడీ సిరీస్. ఈ సిరీస్ రెండు సీజన్ లు ఉంటాయి. ఒక్క సీజన్ కి 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇది ఇద్దరి మిలీనియల్స్ జీవితంలో జరిగే దురదృష్ట చర్యలను గురించి తెలుప్తుంది. ఇప్పుడు ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్  చేయబడింది.

Lodge 49

lodge49
లాడ్జ్ 49 అనేది రెండు సీజన్ల ఉంటుంది. ఈ సీరిస్ లో తండ్రి మరణం తర్వాత కుటుంబ వ్యాపారాలను కోలుపోతాడు. అతడు మెుదటి సీజన్ లో డడ్ ఆర్డర్ ఆఫ్ ది లింక్స్ అని పిలువబడే సోదర క్లబ్ లో చేరాడు. అంతేకాకుండా లాడ్జ్ ‘అతను కోల్పోయిన అందమైన జీవితాన్ని తిరిగి తీసుకురావటాన్నికి ఉపయోగపడుతుంది. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ లో ఉంది.
 
Chewing Gum

chewing gum
చూయింగ్ గమ్ అనేది లండన్ లో ఏర్పాటు చేసిన బ్రిటిష్ టెలివిజన్ సిట్ కామ్. ఈ సిరీస్ మెుత్తం 24 సంవత్సరాల షాప్ అసిస్టెంట్ ట్రేసీ గోర్డాన్ కు చెందినది. మతాన్నికి, సెక్స్ సంబంధించింది. ఇది ఇప్పడు నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేయబడుతుంది.

Man Like Mobeen

man like mobeen
మ్యాన్ గుజ్ ఖాన్ చేత రక్షించబడిన బ్రిటిష్ కామెడీని చూడటానికి ఇది సరైన సమయం. తల్లిదండ్రులు లేనప్పుడు మోబీన్ తన చెల్లెలు అక్సాను చూసుకునే బాధ్యత వహిస్తాడు. అంతేకాకుండా అతను మాదక ద్రవ్యాలను వ్యాపారిగా జీవితాన్ని ప్రారంభిస్తాడు. తర్వాత తన ఆ జీవితాన్ని వదిలేసి ముస్లింగా ఒక మంచి జీవితాన్ని గడపటానికి ప్రయత్నిస్తాడు. ఇది నెట్ ఫ్లిక్స్ లో ఉంది.

The Neighbor

the nrighbour
ఇది స్పానిష్ నెట్ ఫ్లిక్స్ ఒరిజనల్ ఒక సీజన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ శీర్షిక సూపర్ హీరో డెడ్ పాన్ కామెడీతో కూడి ఉంటుంది. జేవియర్ అధికారాలు వచ్చినప్పుడు అతను తన గతాన్ని చెప్పవలసి వస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతుంది.

Godless

godless
గాడ్ లెస్ అనేది అమెరికన్ వెస్ట్రన్ డ్రామా వెబ్ టెలివిజన్ మినిసిరీస్. ఇది ఏడు ఎపిసోడ్స్ సిరీస్. లా బెల్లె, షెరీఫ్, మేరీ అందరు మైనింగ్ లో జరిగిన ఒక ప్రమాదంలో మరణిస్తారు. అంతేకాకుండా షెరీప్లు నేరస్థులను గుర్తించటం, ప్రేమ వికసించటం వంటి వాటితో కథ ఉంటుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
 
Enlightened

enlightened
ఎన్లైటెన్డ్ అనేది అమెరికన్ కామెడీ డ్రామా. ఇది మూడు సీజన్ లో ఉంది. ఒక మహిళ మానసిక పరిస్థితి, ఆరోగ్యం, స్థిరత్వంపై ఆధారపడి కథ ఉంటుంది. ఆమె జీవితంలో వచ్చిన కొన్ని మార్పులను గ్రహించటం. తన జీవితాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించాలనుకోని విఫలమౌవటం ఉంటుంది. ఇది హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది.

The Righteous Gemstones

the righteous gemstones
హాస్యనటుడిగా డానీ మెక్ బ్రైడ్ స్పిట్ టేక్ హ్యూమర్ తో కలిసి నటిస్తాడు. ఇది ఒక సీజన్ ఉంటుంది. దానిలో 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇది రన్ ఆఫ్ ది వరల్డ్ పరిణామాలను ఆశింస్తుంది. ఇప్పుడు హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

Work in Progress

work in progress
హాస్యనటుడు అబ్బిమెక్ నానీ జీవితం పై ఆధారపడి ఉంటుంది కథ. ఈ శీర్షికలో ఒక సీజన్ ఉంటుంది. ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయి. జీవితంలో అస్థిరం కోల్పోయి, నిరాశకు గురైన, ఆత్మహత్య చేసుకున్న 45 ఏళ్ల లెస్బియన్ తో కూడినది. ప్రస్తుతం హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.