మరికొద్ది రోజులు సినిమా కష్టాలు..

కరోనా ఎఫెక్ట్ : సినిమా షూటింగులు, థియేటర్లు మరికొద్ది రోజుల పాటు బంద్..

  • Published By: sekhar ,Published On : March 20, 2020 / 02:20 PM IST
మరికొద్ది రోజులు సినిమా కష్టాలు..

కరోనా ఎఫెక్ట్ : సినిమా షూటింగులు, థియేటర్లు మరికొద్ది రోజుల పాటు బంద్..

గతకొద్ది రోజులుగా కరోనా వైరస్ (కోవిడ్ -19)  ప్రపంచాన్ని గజగజ వణికిస్తుంది. ఈ వైరస్ భారత్‌ను కూడా భయపెడుతోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు కేరళలోనూ పలు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే స్కూల్స్, కాలేజీలు, థియేటర్లు, సినిమా, టెలివిజన్ షూటింగులు, పార్కులు, పబ్బులు, బార్లు, రవాణా సదుపాయాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

మార్చి 15 నుంచి 21 వరకు సినీ పరిశ్రమకు చెందిన 24 శాఖలు షూటింగులో పాల్గొనవని ప్రకటించింది చిత్ర పరిశ్రమ. దీంతో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇళ్లకే పరిమితమైపోయారు. రోజురోజుకీ ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతుండడంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు చర్చించి షూటింగుల నిలిపివేతను మరికొద్ది రోజులపాటు పొడిగించాలని నిర్ణయించారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు సినిమా షూటింగుల నిలిపివేత, థియేటర్ల మూసివేత ఈ నెల 31 వరకూ కొనసాగుతుందని తెలిపారు. 31 తర్వాత రెండు రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క సూచనలతో నిర్ణయం తీసుకుంటామని తెలుపుతూ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది.