Thalapathy 67 : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మొదలుపెట్టేసిన విజయ్.. వంశీ సినిమా అయిపోయిందా?

తమిళ యువ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం లోకేష్ తమిళ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేస్తున్నాడు. విజయ్ 67వ సినిమాగా................

Thalapathy 67 :  తమిళ యువ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం లోకేష్ తమిళ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేస్తున్నాడు. విజయ్ 67వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది. లోకేష్ ఇప్పటికే ఖైదీ, విక్రమ్ సినిమాలు ఒకదానికొకటి లింక్స్ పెట్టి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సృష్టించాడు.

ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలు ఈ యూనివర్స్ లో ఉంటాయని రాబోయే సినిమాలపై కూడా అంచనాలు పెంచేసాడు లోకేష్. లోకేష్ ఇప్పటికే విజయ్ తో మాస్టర్ సినిమా తీసి హిట్ ఇచ్చాడు. అందులో విజయ్ ని లెక్చరర్ గా చూపించాడు. ఇప్పుడు విజయ్ తో చేస్తున్న సినిమాలో గ్యాంగ్‌స్టర్ గా చూపించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాని కూడా తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో కలిపేస్తారని, గత సినిమాలతో లింక్ చేస్తాడని సమాచారం.

Mrunal Thakur : చెల్లెలు పాత్రలో సీతారామం హీరోయిన్.. వద్దన్నా ఎందుకు చేస్తుందో చెప్పింది..

సోమవారం నాడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టినట్టు సమాచారం. ఫోన్స్ లోపలి అనుమతించకపోవడంతో ఫోటోలు, వీడియోలు బయటకి రాలేదు. నిర్మాణ సంస్థ స్వయంగా సినిమా లాంచింగ్ ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. దీంతో విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వరిసు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాతికి రిలీజ్ కానుంది. సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు ఇటీవల కొన్ని పిక్స్ రిలీజ్ చేసినా షూట్ పూర్తయినట్టు మాత్రం సమాచారం ఇవ్వలేదు. విజయ్ లోకేష్ సినిమా మొదలుపెట్టనుండటంతో వంశీ సినిమా షూటింగ్ పూర్తయి ఉంటుందని భావిస్తున్నారు. సంక్రాంతికి వారసుడు సినిమాతో విజయ్ రానున్నాడు.

ట్రెండింగ్ వార్తలు