AHA : ‘తెలుగు ఇండియన్ ఐడల్‌’కి జడ్జిగా తమన్

తెలుగులో ఉండే కొత్త సింగర్స్ ని ఎంకరేజ్ చేయడానికి త్వరలో తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంతో రాబోతుంది ఆహా. ఇప్పటికే ఈ షోకి సంబందించిన ఆడిషన్స్ పూర్తయ్యాయి. ఈ షోకి హోస్ట్ గా..........

AHA :  ‘తెలుగు ఇండియన్ ఐడల్‌’కి జడ్జిగా తమన్

Aha

Thaman :   ప్రస్తుతం తెలుగు ఓటీటీ ఆహా దూసుకెళ్తుంది. కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు, ప్రోగ్రామ్స్ తో తెలుగు వారికి బాగా దగ్గరవుతుంది. రోజూ ఏదో ఒక కొత్త కంటెంట్స్ ఆహాలో కనిపిస్తుంది. ఇక ఇప్పటికే చాలా కొత్త ప్రోగ్రామ్స్ ని తీసుకొచ్చారు ఇటీవల ‘అన్ స్టాపబుల్ విత్ NBK’తో ఆహాకి బాగా పేరొచ్చింది. త్వరలో మరో కొత్త ప్రోగ్రాంతో రాబోతుంది. తెలుగులో ఉండే కొత్త సింగర్స్ ని ఎంకరేజ్ చేయడానికి త్వరలో తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంతో రాబోతుంది ఆహా.

ఇప్పటికే ఈ షోకి సంబందించిన ఆడిషన్స్ పూర్తయ్యాయి. ఈ షోకి హోస్ట్ గా సింగర్‌, బిగ్‌బాస్ ఐదో సీజన్‌ కంటెస్టెంట్‌, గతంలో ఇండియన్ ఐడల్ గెలుచుకున్న శ్రీరామచంద్రను ప్రకటించారు. త్వరలోనే ఈ షోకి సంబంధించిన షూటింగ్ ప్రారంభం అవ్వనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ తెలుగు ఇండియన్ ఐడల్ కి ఒక జడ్జిగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని తీసుకోబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఆహా టీం తమన్ తో మాట్లాడినట్లు, తమన్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

Chiranjeevi : ముచ్చటగా మూడో సారి.. జగన్ చిరు భేటీ.. సినీ పరిశ్రమకి లాభం చేకూరిందా??

ప్రస్తుతం తమన్ వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. టాప్ హీరోల సినిమాలన్నిటికీ తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అతను ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే సినిమాలు హిట్ అవుతున్నాయి అని కూడా అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా తమన్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి టైంలో తమన్ ని తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంకి జడ్జిగా పెడుతున్నారంటే ఆ ప్రోగ్రాంకి మంచి స్పందన రావడం పక్కా అని తెలుస్తుంది.