10TV Exclusive- ‘బంతిపూల’ పాట అలా పుట్టింది.. పోలీసుల కోసం పాట చేస్తున్నాం..

10TV Live- తమన్ Exclusive Interview..

10TV Exclusive- ‘బంతిపూల’ పాట అలా పుట్టింది.. పోలీసుల కోసం పాట చేస్తున్నాం..

Ss Thaman

10TV Live- తమన్ Exclusive Interview..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో’. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ సినిమా ఇండ‌స్ట్రీ హిట్‌ను సాధించి నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్ చేసింది. సినిమా కంటే ముందే త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో విడుద‌లైన పాటలు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాజాగా ‘బుట్ట‌బొమ్మ‌..’ వీడియో సాంగ్ 150 మిలియ‌న్ వ్యూస్‌ను ద‌క్కించుకుని రీసెంట్‌గా విడుద‌లైన తెలుగు వీడియో సాంగ్స్‌లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ 10TVతో మాట్లాడారు.

‘బంతిపూల జానకి’ పాట క్యాచీగా ఉంటుంది.. ఓ లైన్ పాడమని, అసలు ఆ పాట ఎలా పుట్టుకొచ్చిందని అడగ్గా.. ముందుగా రామ జోగయ్య శాస్త్రి గారి మీదే ట్యూన్ కట్టామని.. ‘రామ్ జే రామ్ జే’ అంటే ఆయన దానిని ‘రామ్ జే’గా మార్చి రాశారని చెప్పారు. అలాగే కరోనా కాలంలో అహర్నిశలూ శ్రమిస్తున్న పోలీసు వారి గురించి ఓ పాట కంపోజ్ చేస్తున్నట్లు తమన్ తెలిపారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఆధర్వంలో రామ జోగయ్య శాస్త్రితో కలిసి ఓ అద్భుతమైన పాటను రూపొందిస్తున్నామని, త్వరలోనే ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు తమన్.