SSMB28: మే 31న ఇచ్చిపడేద్దాం అంటోన్న థమన్.. మహేష్ మూవీ అప్డేట్‌పై మరింత క్రేజ్!

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రంపై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో తెలిసిందే. ఈ అంచనాలను మరింతగా పెంచుతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్.

SSMB28: మే 31న ఇచ్చిపడేద్దాం అంటోన్న థమన్.. మహేష్ మూవీ అప్డేట్‌పై మరింత క్రేజ్!

Thaman Increases The Hype On SSMB28 Update

SSMB28: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌లో సెట్ అయ్యాయి. ఈ సినిమాతో మహేష్ మరోసారి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు.

SSMB28: మహేష్-త్రివిక్రమ్ నెక్ట్స్ అప్డేట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న థమన్, ఈ సినిమాపై బజ్‌ను మరింతగా పెంచుతున్నాడు. ఈ సినిమా నెక్ట్స్ అప్డేట్‌ను మే 31న రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. దీంతో మే 31 కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా, థమన్ తాజాగా ఈ అప్డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. మే 31న ఇచ్చిపడేద్దాం అంటూ ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ గురించి ఓ క్లూ ఇచ్చాడు. మహేష్ మూవీ నుండి రాబోయే నెక్ట్స్ అప్డేట్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ అయి ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు.

SSMB28: సర్‌ప్రైజ్ ఇచ్చిన మహేష్.. మాస్ ఎంట్రీతో రిలీజ్ డేట్ లాక్ చేశాడుగా!

ఇక ఈ సినిమాలో వింటేజ్ లుక్స్‌తో మహేష్ ర్యాంపేజ్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతుండగా, ఈ సినిమాలో అందాల భామలు పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాను తనదైన మార్క్ పూర్తి ఎంటర్‌టైనింగ్ మూవీగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.