Thaman : బాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన తమన్

తమన్ మ్యూజిక్ కి జనం ఫిదా అయిపోతున్నారు. 'అల వైకుంఠపురంలో' సినిమాలో సాంగ్స్ కి ఇచ్చిన మ్యూజిక్ తో దుమ్ము దులిపాడు. ఇక 'క్రాక్', 'అఖండ' సినిమాలతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో తనకి....

10TV Telugu News

Thaman :  ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ ఒకరు. స్టార్ హీరోలంతా తమన్ వెనక పరిగెడుతున్నారు. తమ సినిమాకి తమన్ మ్యూజిక్ కొడితే సినిమా హిట్ అవుతుందని నమ్ముతున్నారు. టాలీవుడ్ లోని భారీ ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడు తమన్ చేతిలోనే ఉన్నాయి. తమన్ మ్యూజిక్ కి జనం ఫిదా అయిపోతున్నారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో సాంగ్స్ కి ఇచ్చిన మ్యూజిక్ తో దుమ్ము దులిపాడు. ఇక ‘క్రాక్’, ‘అఖండ’ సినిమాలతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో తనకి ఎవరూ పోటీ రారని నిరూపించుకున్నాడు. ఇక ‘అఖండ’ సినిమా అయితే తమన్ వల్లే హిట్ అయిందని కూడా అంటున్నారు.

Anchor Suma : యాంకర్ సుమ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు

ఇంత పేరు తెచ్చుకున్న తమన్ కి వేరే భాషల్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే తమిళ్, కన్నడ సినిమాలకి కూడా పని చేశాడు. బాలీవుడ్ సినిమాలకు కూడా ఆఫర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ లో చేస్తే దేశమంతా గుర్తింపు వస్తుందని చాలా మంది బాలీవుడ్ కి వెళ్తూ ఉంటారు. ఇలాగే తమన్ కి కూడా ఆఫర్స్ రావడంతో బాలీవుడ్ కి వెళ్ళాడు.

Bigg Boss 5 : కంటెస్టెంట్స్‌కి సినిమా క్యారెక్టర్స్ డెడికేట్.. అర్జున్‌రెడ్డి, అపరిచితుడు??

హిందీలో ‘గోల్ మాల్’, ‘సింబా’ లాంటి కొన్ని సినిమాలకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ తరువాత ఆఫర్స్ వచ్చినా తమన్ చేయను అని ఫిక్స్ అయ్యాడంట. అందుకు కారణం ఏమిటని ఇటీవల ‘అఖండ’ సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలో అడిగితే.. ”హిందీలో ఒక సినిమాకి ఐదారుగురు సంగీత దర్శకులు పని చేస్తారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్స్ చే కొట్టిస్తారు. ఆ పద్ధతే నాకు నచ్చలేదు. ఒక సినిమాకి ఒక సంగీత దర్శకుడు పని చేసినప్పుడే ఆ సినిమాపై అతనికి పూర్తి అవగాహన ఉంటుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా. ఒక కంటెంట్ పై ఐదారుమంది పనిచేయడమనేది నాకు నచ్చలేదు. అందుకే అక్కడ నేను ఉండలేను అని అర్థమైంది. అందుకే బాలీవుడ్ కి బై బై చెప్పేసి వచ్చేశాను” అని తెలిపాడు. మరి భవిష్యత్తులో అయినా బాలీవుడ్ నుంచి పెద్ద ఆఫర్స్ వస్తే ఏం చేస్తాడో?

×