SSMB28: మహేష్-త్రివిక్రమ్ మూవీపై గాలి వార్తలు.. నవ్వుకున్న థమన్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండటంతో ఈ మూవీ నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండటంతో ఈ మూవీ నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గతకొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
SSMB28 : డైరెక్షన్ చేయకుండా క్రికెట్ ఆడుతున్న త్రివిక్రమ్.. వైరల్ వీడియో!
మహేష్ బాబు కెరీర్‌లో 28వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే థమన్ ఈ సినిమా కోసం ట్యూన్ చేసిన మొదటి పాట మహేష్, త్రివిక్రమ్‌లకు నచ్చలేదని.. దీంతో థమన్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక చిత్ర యూనిట్‌తో మనస్పర్థల కారణంగా థమన్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా పలు వార్తలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
SSMB28: మహేష్-త్రివిక్రమ్ సినిమా ఓటీటీ రైట్స్‌కు ఎంత రేటో తెలుసా..?
అయితే ఈ వార్తలపై థమన్ తాజాగా స్పందించాడు. ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని ఆయన కొట్టిపారేశాడు. దీంతో ఈ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలు కేవలం గాలివార్తలే అని తేలిపోయింది. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది.