Thank You: అక్కినేని హీరో ఆశలకు ఎసరుపెట్టిన ‘వరుణ’మామ!

అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ జూలై 22న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు హైదరాబాద్‌లో వరుణుడి రూపంలో పెద్ద అడ్డంకి ఎదురయ్యింది. వర్షం కారణంగా ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు అంతంతమాత్రంగానే రావడం గమనార్హం.

Thank You: అక్కినేని హీరో ఆశలకు ఎసరుపెట్టిన ‘వరుణ’మామ!

Thank You Movie Effected With Heavy Rains

Thank You: అక్కినేని హీరో నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ రిలీజ్‌కు ముందర ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని అందరూ ఆశించారు. అయితే ఈ సినిమా రిలీజ్ రోజున మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉండటంత, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు మిస్ కావడంతో పబ్లిక్ టాక్ కూడా ఓ మాదిరిగా వచ్చింది.

Thank You: దిల్ రాజుకు థ్యాంక్యూ చెబుతున్న ఆడియెన్స్.. ఎందుకంటే?

అయితే ప్రేక్షకుల టాక్ ఈ సినిమా రిజల్ట్‌పై ప్రభావం చూపుతుందనే విషయం అందిరికీ తెలిసిందే. కానీ ‘థ్యాంక్యూ’ సినిమాపై మరో అంశం కూడా పెద్ద ప్రభావం చూపింది. అదే హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం. జూలై 22న థ్యాంక్యూ సినమా భారీ అంచనాల మధ్య రిలీజ్ కాగా, శుక్రవారం నాడు హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. రోజంతా వర్షం కురవడంతో జనం బయటకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తిని చూపలేదు. దీంతో ఈ ప్రభావం థ్యాంక్యూ సినిమాపై పడింది.

Thank You Movie: థాంక్ యూ.. విక్రమ్ కుమార్‌కు, చైతూ బ్రేకిస్తాడా?

థ్యాంక్యూ సినిమా రిలీజ్ అయిన థియేటర్ల వద్ద జనం అంతంతమాత్రంగానే కనిపించారు. దీంతో ఈ ఎఫెక్ట్ మూవీ తొలిరోజు వసూళ్లపై పడటం ఖాయమని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా అక్కినేని నాగచైతన్య థ్యాంక్యూ సినిమాపై పెట్టుకున్న ఆశలపై వరుణుడు నీళ్లు మామూలుగా జల్లలేదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రాశి ఖన్నా, మాళవికా నాయర్‌లు హీరోయిన్లుగా నటించగా, థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.