Thankyou : డేట్ మార్చుకున్న చైతూ.. నిఖిల్‌కి పోటీగా..

నాగ చైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. త్వరలో ‘థాంక్యూ’ సినిమాతో రాబోతున్నాడు. మొదట ఈ సినిమాను జూలై 8న విడుదల చేస్తామని ప్రకటించారు.........

Thankyou : డేట్ మార్చుకున్న చైతూ.. నిఖిల్‌కి పోటీగా..

Thank You

Naga Chaithanya : నాగ చైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. త్వరలో ‘థాంక్యూ’ సినిమాతో రాబోతున్నాడు. రాశీఖన్నా, మాళవికా నాయర్‌, అవికాగోర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఈ సినిమాలో. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్, కొన్ని సాంగ్స్ రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనని తెచ్చుకున్నాయి. మొదట ఈ సినిమాను జూలై 8న విడుదల చేస్తామని ప్రకటించారు.

అయితే తాజాగా రిలీజ్‌ డేట్‌ను మారుస్తున్నట్టు ప్రకటించారు చిత్ర యూనిట్. థ్యాంక్యూ సినిమాని జూలై 22న రిలీజ్ చేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తికాకపోవడం వల్లే ఈ సినిమాని వాయిదా వేసినట్టు తెలుస్తుంది. జులై 8న ఏ సినిమా రిలీజ్ లేకపోవడంతో చైతూ సింగిల్ గా వచ్చి మరో హిట్ కొడతాడు అనుకున్నారు అంతా. అయితే తాజాగా జులై 22న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు అని ప్రకటించడంతో చైతూకి పోటీ తప్పట్లేదు.

Kartik Aryan : చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌కి హిట్ ఇచ్చినందుకు.. హీరోకి 5 కోట్ల కార్ ఇచ్చిన నిర్మాత

ఇదే రోజు ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న నిఖిల్ కార్తికేయ 2 కూడా రిలీజ్ కానుంది. బాలీవుడ్ సినిమా షంషేర్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. దీంతో ‘థ్యాంక్యూ’కి పోటీ తప్పేట్లు లేదు. ఒక వేళ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్స్ లో దెబ్బ పడే అవకాశం ఉంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ కొత్త డేట్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.