దియా మీర్జా పెళ్లి చేసిన మహిళా పూజారి!

దియా మీర్జా పెళ్లి చేసిన మహిళా పూజారి!

Thank you Sheela Atta : పూజారులు అనగానే..ముందుగా ఎవరు గుర్తుకొస్తారు ? మగవారే కదా. కానీ..ఈ మధ్యకాలంలో..మగ పూజారులాగానే.. పూజారిణిలు కూడా పూజలు చేయగలరు అని నిరూపిస్తున్నారు కొందరు. పూజలు, పెళ్లిళ్ల నుంచి కర్మల వరకూ అన్నీ చేస్తున్నారు. పురుషాధిక్య రంగంలో తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నారు. తాజాగా..బాలీవుడ్ నటి దియా మీర్జా పెళ్లిని ఓ మహిళా పూజారీ చేయడం విశేషం. వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు దియా. ఇందులో మహిళా పూజారీ చేతుల మీదుగా..వివాహం జరిగినట్లు తెలియడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.

దియా మీర్జాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ వివాహాన్ని జరిపించినందుకు శీలా అత్తాకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు, మనం కలిసి ఉంటే ఏదైనా సాధ్యమేనంటూ..స్త్రీ వాదాన్ని చాటుతూ..దియా మీర్జా ట్వీట్ చేశారు. ఇక దియా మీర్జా విషయానికి వస్తే..2014లో సినీ నిర్మాత సాహిల్ సంఘును వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల వైవాహిక జీవితం త‌ర్వాత కొన్ని కారణాల వల్ల..వారు 2019లో విడిపోయి విడాకులు తీసుకున్నారు.

తర్వాత..వ్యాపారవేత్త..వైభవ్ రేఖీతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఫిబ్రవరి 15వ తేదీన వీరు ఒక్కటయ్యారు. ముంబైలో కొద్ది మంది స‌న్నిహితులు, శ్రేయోభిలాషుల మ‌ధ్య వీరి వివ‌వాం జరిగింది. దియా రెడ్ డ్రెస్ లో కనిపించగా..వైభ‌వ్ కుర్తాలో క‌ల‌ర్‌ఫుల్‌గా క‌నిపించాడు. వివాహానికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దియామీర్జా తెలుగు చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’లో ప్రధాన పాత్రలో నటిస్తోంది.
త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నాగార్జున NIA ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.