Tanushree Dutta : యాక్సిడెంట్‌లో గాయపడ్డ బాలీవుడ్ హీరోయిన్.. అయినా అలాగే దర్శనానికి..

బాలీవుడ్‌ హీరోయిన్‌ తనుశ్రీ దత్తా మంగళవారం కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం కారులో వెళ్తుండగా ఆమె కారు బ్రేకులు ఫెయిల్............

Tanushree Dutta : యాక్సిడెంట్‌లో గాయపడ్డ బాలీవుడ్ హీరోయిన్.. అయినా అలాగే దర్శనానికి..

Thanushree

Tanushree Dutta :  ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ తనుశ్రీ దత్తా మంగళవారం కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం కారులో వెళ్తుండగా ఆమె కారు బ్రేకులు ఫెయిల్ అయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె కారు డ్యామేజ్ కాగా తనుశ్రీ కాలికి గాయాలు అయ్యాయి. దీంతో దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లగా చికిత్స చేసి కుట్లు వేశారు. ఆ తర్వాత అలాగే దర్శనానికి వెళ్ళింది ఈ హీరోయిన్.

Vishwak Sen : విశ్వక్‌సేన్‌పై చర్యలు తీసుకుంటాం.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు..

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం అనంతరం గుడి ఆవరణలో ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు పోస్ట్ చేస్తూ తన ప్రమాదం గురించి కూడా తెలిపింది. తనుశ్రీ.. ‘ఈ రోజు నా జీవితంలో చాలా సాహసవంతమైన రోజు. గుడికి వెళ్తుండగా నా కార్ బ్రేకులు ఫెయిల్ అయి రోడ్డు ప్రమాదం జరిగింది. కాలికి కొన్ని కుట్లు వేశారు. ఎలాగైతేనేం దర్శనం చేసుకున్నాను. జై మహాకాళ్‌” అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది.