Adipurush : ఆదిపురుష్‌కు ‘ది ఫ్లాష్’ టెన్షన్.. ఇండియాలో కాదు గానీ.. ఓవర్సీస్‌లో మాత్రం..
ప్రభాస్(Prabhas) రాముడిగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి సనన్(Kriti Sanon) సీతగా, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్(Saif Alikhan) కనిపించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Adipurush-The Flash
Adipurush-The Flash:ప్రభాస్(Prabhas) రాముడిగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి సనన్(Kriti Sanon) సీతగా, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్(Saif Alikhan) కనిపించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం 2023 జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మంగళవారం(జూన్ 6న) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు.
మరో రెండు వారాల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభంకానున్నాయి. అయితే.. ఈ సినిమా ఓవర్సీస్ రీలీజ్ గురించి చిత్రబృందం కాస్త ఆందోళన చెందుతోంది. ఈ సినిమా విడుదల కానున్న రోజే ఎజ్ర మిల్లర్, మైఖేల్ కీటన్, సాషా కాలి ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది ఫ్లాష్’ విడుదల కానుంది. భారత్‌లో ఈ సినిమా ప్రభావం అంతగా ఉండకపోవచ్చు గానీ ఓవర్సీస్‌లో మాత్రం ఈ చిత్రం వల్ల ఆదిపురుష్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు.
Adipurush : ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్ వచ్చేసింది.. వస్తున్నా రావణ అంటూ రాముడు యుద్ధం ప్రకటించేశాడు..
ఆదిపురుష్ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్‌లోని 130 లోకేషన్లలో ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే.. ఇంతకముందు యూఎస్ఏలో నాని హీరోగా నటించిన ‘దసరా’ చిత్రం విడుదల చేయడానికి పది రోజుల ముందుగానే 200 పైగా లొకేషన్లలో అడ్వాన్స్ బుకింగ్స్‌ను తెరవడం గమనార్హం. కాగా.. ఈ వారం చివరి నాటికి లొకేషన్ల సంఖ్యను పెంచే అవకాశం ఉందని ట్రేడ్ నివేదికలు చెబుతున్నాయి.
ది ఫ్లాష్ విడుదల కానుండడంతో ఆ సంఖ్య 200 దాటుందా లేదా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ఆదిపురుష్ కనుక సోలోగా రిలీజ్ అయితే మాత్రం 300లకు పైగా లొకేషన్లలలో రిలీజ్ అయ్యేది. కాగా.. సినిమా విడుదల తేదీ నాటికి లొకేషన్ల సంఖ్య పెరుగుతుందో లేదో చూడాలి.
Tamannah: ప్రేమించుకుంటున్నారా..? సిరీస్ కోసమే కలిసి ప్రయాణమా..?