The Ghost: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న ‘ది ఘోస్ట్’

అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’ దసరా కానుకగా నేడు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించగా, ఈ సినిమాలో నాగ్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ‘ది ఘోస్ట్’ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

The Ghost: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న ‘ది ఘోస్ట్’

The Ghost Movie Locks OTT Partner

The Ghost: అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’ దసరా కానుకగా నేడు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించగా, ఈ సినిమాలో నాగ్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాకు అన్ని చోట్లా మంచి టాక్ వస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

The Ghost: సంధ్య 35ఎంఎం థియేటర్లో సందడి చేసిన ది ఘోస్ట్ టీమ్!

పూర్తి యాక్షన్‌ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘ది ఘోస్ట్’ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా రైట్స్‌ను భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. అయితే ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్‌ను బట్టి ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా చిత్ర యూనిట్‌తో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుందట.

The Ghost: ‘ది ఘోస్ట్’తో రిస్క్ చేస్తోన్న నాగ్.. వర్కవుట్ అయ్యేనా?

నాగ్ సరసన అందాల భామ సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా, గుల్ పనాగ్, మనీష్ చౌదరి, రవి వర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.