Al Pacino : 83 ఏళ్ల వయసులో ఫాదర్ కాబోతున్న హాలీవుడ్ గాడ్‌ఫాదర్.. అది కూడా 29 ఏళ్ల ప్రేయసితో!
హాలీవుడ్ గాడ్ ఫాదర్ నటుడు అల్ పచినో.. 83 ఏళ్ళ వయసులో నాలుగోసారి తండ్రి కాబోతున్నాడు. అది కూడా 29 ఏళ్ల ప్రేయసితో..

The Godfather Al Pacino to be a father at 83 years age
The Godfather Al Pacino : హాలీవుడ్ ‘ది గాడ్‌ఫాదర్’ సినిమా వరల్డ్ లోని ప్రతి డాన్ మూవీ కి ఒక ఇన్‌స్పిరేషన్ లాంటిది. క్రైమ్ మూవీస్ ని ఇష్టపడే ప్రతి ఒక్కరు గాడ్‌ఫాదర్ 3 సినిమాలను చూసి ఉంటారు. ఇక ఆ సినిమాలో నటించిన ‘అల్ పచినో’ అందరికి గుర్తుకు ఉండే ఉంటాడు. గత నెలలోనే (ఏప్రిల్ 25) ఈ నటుడు 83 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఇంతటి వయసులో ఈ నటుడు ‘డాడీ’ అని పిలిపించుకోవడానికి రెడీ అవుతున్నాడు. అల్ పచినో కొంత కాలంగా 29 ఏళ్ల నూర్ అల్ఫల్లాతో సహజీవనం చేస్తున్నాడు.
Soniya Bansal : IIFA కార్పెట్ పై బుట్టబొమ్మలా అట్రాక్ట్ చేసిన ధీర నటి సోనియా బన్సల్..
అయితే గత ఏడాది నూర్ ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రస్తుతం 8 నెలలు గర్భంతో ఉన్న ఆమె.. మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. 83 ఏళ్ళు వయసులో తండ్రి అవుతున్న అల్ పచినోని చూసి నెటిజెన్లు షాక్ అవుతున్నారు. కాగా అల్ పచినో.. నూర్ కంటే ముందు ఇద్దరితో డేటింగ్ చేసి తండ్రి అయ్యాడు. యాక్టింగ్ కోచ్ జన్ తరంత్ తో సహజీవనం చేసిన పచినో 1989లో జూలీ అనే పాప పుట్టింది. అయితే బిడ్డ పుట్టిన తరువాత కూడా పెళ్లి చేసుకోకుండా కొంతకాలానికే విడిపోయారు.
Hint Movie : మైత్రి మూవీ క్రియేషన్స్ ‘హింట్’ మూవీ పోస్టర్ లాంచ్.. హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్!
ఇక ఆ తరువాత యాక్ట్రెస్ బెవర్లీ డియాంగిలోతో డేటింగ్ మొదలు పెట్టాడు. ఆమెతో సహజీవనంలో ఈసారి ఇద్దరి కవలలకు తండ్రి అయ్యాడు. అయితే ఆమెతో కూడా బ్రేకప్ చెప్పి విడిపోయాడు. ఇప్పుడు నూర్ అల్ఫల్లాతో డేటింగ్ చేసి మరోసారి తండ్రి అయ్యాడు. మరి ఇప్పుడైనా పెళ్లి జీవితంలోకి అడుగు పెడతాడా? లేదా? అనేది చూడాలి. కాగా నూర్ అల్ఫల్లా కూడా అల్ పచినో కంటే ముందు ఇద్దరితో రిలేషన్ లో ఉండి బ్రేకప్ అయ్యింది. ఇప్పుడు అల్ అండ్ నూర్‌లు ఇద్దరు మూడో రిలేషన్‌షిప్‌లోనే ఉన్నారు.