The Godfather : ది గాడ్ ఫాదర్ @ 50 ఇయర్స్

మాఫియా సినిమాల బ్రాండ్ అంబాసిడర్... సినీలవర్స్ ఆల్ టైమ్ పేవరేట్.. ది గాడ్ ఫాదర్. 1972వ సంవత్సరం మార్చి 24న రిలీజ్ అయిన ఈ హాలీవుడ్ మూవీ పెను సంచలనం సృష్టించింది.

The Godfather : ది గాడ్ ఫాదర్ @ 50 ఇయర్స్

the God Father

The Godfather :  మాఫియా సినిమాల బ్రాండ్ అంబాసిడర్… సినీలవర్స్ ఆల్ టైమ్ పేవరేట్.. ది గాడ్ ఫాదర్. 1972వ సంవత్సరం మార్చి 24న రిలీజ్ అయిన ఈ హాలీవుడ్ మూవీ పెను సంచలనం సృష్టించింది. అప్పటి వరకూ ఉన్న రికార్డులను తుడిచిపెట్టి.. బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించింది. సినిమా అంటే ఇలా ఉండాలని ప్రేక్షకులకు… సినిమా అంటే ఇలా తీయాలని మేకర్స్ కు కొత్త పాఠాలు నేర్పించిన గాడ్ ఫాదర్ 50 ఏళ్ల సంబరాలను జరుపుకుంటోంది.

యాక్టింగ్, డైరెక్షన్, మ్యూజిక్, ఫోటోగ్రఫీ ఇలా అన్ని సినీ విభాగాలకు సంబంధించి పర్ఫెక్ట్ గా అధ్యయనం చేయాలంటే గాడ్ ఫాదర్ చూడాలంటారు చాలా మంది. హై ఎండ్ వ్యాల్యూస్ తో 50ఏళ్ల కిందట తెరకెక్కిన గాడ్ ఫాదర్ ఇప్పటికీ.. ఎప్పటికీ ఆల్ టైమ్ బెస్ట్ లిస్ట్ లో స్థానం దక్కించుకుంటూనే ఉంది. ఎన్నో సినిమాలకి, ఎందరో మేకర్స్‌కి ఇన్సిపిరేషన్‌గా నిలుస్తూనే ఉంది.

ప్రపంచంలో ఉన్నదే భారతంలో ఉంది. భారతంలో లేనిది మరెక్కడా లేదు అని మహాభారతం గురించి వేదవ్యాసుడు అన్నట్టు.. మాఫియా, డాన్, గాడ్ ఫాదర్ సబ్జెక్టుతో ఏ భాషలో ఎప్పుడు సినిమా వచ్చినా అందులో ఒకటో రెండో సీన్లు గాడ్ ఫాదర్ సినిమాని గుర్తు చేసేలా ఉంటాయి. అందుకే మాఫియా సినిమాల మహాభారతంగా గాడ్ ఫాదర్ చరిత్రలో నిలిచిపోయింది.

1972 మార్చి 14న ప్రివ్యూ జరుపుకుని.. మార్చి 24న అమెరికా అంతటా రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించింది గాడ్ ఫాదర్. 7 మిలియన్ డాలర్లతో బయటికొచ్చిన సినిమా ఏకంగా 287 మిలియన్ డాలర్లను రాబట్టింది. ఆస్కార్‌తో పాటూ ఎన్నో ప్రిస్టీజియస్ అవార్డులను తెచ్చిపెట్టింది. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 4కే, డాల్బీ ఎక్స్‌పీరియెన్స్‌తో సినిమాను రీసెంట్‌గా రీరిలీజ్ చేసినా కూడా ఆడియెన్స్ ఆదరిస్తున్నారు.

రచయిత మేరియా ఫ్యూజో రాసిన నవల ఆధారంగా హాలీవుడ్ నిర్మాణ సంస్థ పారమౌంట్ స్టూడియోస్ గాడ్ ఫాదర్ ను తెరకెక్కించి ఆర్థిక కష్టాల నుంచి బయటపడింది. నవలా చాలా చీప్‌గా ఉందని ముందు తిరస్కరించిన ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా.. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు ఈ సినిమాను డైరెక్ట్ చేసి బంపర్ హిట్ కొట్టాడు. వరుస ఫ్లాప్‌లతో ఉన్నా సరే మొదట అంగీకరించని హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాండో ఈ సినిమాతో మళ్లీ విజయఢంకా మోగించాడు. నిర్మాతలు, దర్శకుడు, హీరో.. వీళ్లకు చాలా ఏళ్లుగా దూరమైన విజయాన్ని ఒక్క దెబ్బకు గాడ్ ఫాదర్ తెచ్చిపెట్టింది.

గాడ్ ఫాదర్ సినిమాకి తర్వాత రెండు సీక్వెల్స్ వచ్చాయి. రెండో పార్ట్ సూపర్ హిట్ గా నిలిస్తే.. మూడో పార్ట్ మాత్రం జనాలకి పెద్దగా కనెక్ట్ కాలేదు. గాడ్ ఫాదర్ స్ఫూర్తితో ఆ తర్వాత హాలీవుడ్లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. భారతీయ దర్శకుల్లో గాడ్ ఫాదర్ ప్రభావం ఫిరోజ్ ఖాన్, మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, భరతన్ వంటి కొందరు దర్శకులపై 90ల కాలంలో స్పష్టంగా కనిపించింది. ఫిరోజ్ ఖాన్ ధర్మాత్మ చూస్తే… గాడ్ ఫాదర్ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తాయి.
Also Read : RRR : ‘ఆర్ఆర్ఆర్’లో హైలెట్స్ ఇవే.. బెనిఫిట్ షో రివ్యూ ఇదే..
డాన్, గ్రూప్స్ ఫైట్ అంశాలతో ట్రెండీ డైరెక్టర్‌గా ఎదిగిన రామ్‌గోపాల్‌వర్మకు స్ఫూర్తి కూడా గాడ్ ఫాదరే. గాయం, సర్కార్ సినిమాల్లోని కొన్ని సీన్స్‌ను ది గాడ్ ఫాదర్ నుంచి రాము దించేసాడు. ఆ తర్వాత ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు డైరెక్ట్‌గా గాడ్ ఫాదర్ పేరును.. ఇన్‌డైరెక్ట్‌గా ఆ సినిమాలోని భావాన్ని చూపించాయి. త్వరలోనే మెగాస్టార్ సినిమా గాడ్ ఫాదర్ పేరుతోనే రాబోతుంది. సో 50 ఏళ్ల నుంచి ఇంతమందిని ఇన్నిరకాలుగా ప్రభావితం చేసిన గాడ్ ఫాదర్ లాంటి సినిమా మరొకటి ఉండదేమో.