Akhanda Bulls: అఖండకే హైలెట్ ఈ గిత్తలు.. కృష్ణార్జునుల ప్రత్యేకతలివే!

అఖండ గర్జన కొనసాగుతూనే ఉంది. థియేటర్లు దద్దరిల్లేలా బాలయ్య ఊరమాస్ మానియా ఒక ఊపు ఊపేస్తోంది. ప్రేక్షకులు థియేటర్లను వస్తారా రారా అనే అనుమానాలను..

Akhanda Bulls: అఖండకే హైలెట్ ఈ గిత్తలు.. కృష్ణార్జునుల ప్రత్యేకతలివే!

Akhanda Bulls

Akhanda Bulls: అఖండ గర్జన కొనసాగుతూనే ఉంది. థియేటర్లు దద్దరిల్లేలా బాలయ్య ఊరమాస్ మానియా ఒక ఊపు ఊపేస్తోంది. ప్రేక్షకులు థియేటర్లను వస్తారా రారా అనే అనుమానాలను పటాపంచెలు చేస్తూ బాలయ్య ఉగ్రరూపం థియేటర్లను పరుగులు పెట్టిస్తుంది. అఖండ సినిమాలో బాలయ్య నటన, బోయపాటి దర్శకత్వంతో పాటు మరో రెండు అంశాలపై సినిమా గురించి చర్చ జరుగుతుంది. అదే థమన్ మ్యూజిక్.. సినిమాలోని గిత్తలు.

Mahesh Babu: మహేష్ చేతికి మరో బ్రాండ్.. ఏడాదికి రూ.15 కోట్లు?

థమన్ మ్యూజిక్ తో అఖండ ఉగ్రరూపం ప్రేక్షకులను పూనకాలు తెప్పిస్తే.. ఎద్దుల ఫైటింగ్‌ సీన్‌కు ఫిదా అవ్వని వారు ఉండరు. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది ఈ సీన్‌. ఈ గిత్తెలతో హీరో అరంగేట్రం కూడా అదుర్స్‌ కాగా.. సినిమాకే హైలైట్‌ గా నిలిచిన గిత్తెల గురించి తెలుగు రాస్ట్రాల్లో ఒకటే ఆసక్తి నెలకొంది. ఆ ఎద్దులు ఎక్కడివి.. వాటి ప్రత్యేకతలేంటి అంటూ వెతకడం కూడా మొదలు పెట్టారు.

Bigg Boss 5: మళ్ళీ హౌస్‌లోకి రవి రీఎంట్రీ.. నిజమెంత?

ఈ అఖండ గిత్తలు చౌటుప్ప ల్‌ మండలం లక్కారం గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్‌ వి. స్థానికంగా తన గోశాలో ఆవులు, కోడెలను పెంచే శ్రీనివాస్ రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన కోడెలకు కృష్ణుడు, అర్జునుడు అనే పేర్లు పెట్టి.. పేరు పెట్టి పిలిస్తే పలికేలా, చెప్పిన మాట వినేలా వాటికి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చాడు. గతేడాది రామోజీ ఫిలింసిటీలో షూటింగ్‌ జరుగుతుండడంతో ఎద్దుల చర్చ రాగా అక్కడే ఉన్న శ్రీనివాస్ తన కోడెలకు సంబంధించిన వీడియోలు చూపించడం.. దర్శకుడు బోయపాటితో పాటు మేకర్స్ కు నచ్చడంతో ఇలా అఖండలో భాగమయ్యాయి.

Akhanda: మాస్.. మాస్.. మాస్.. దంచికొడుతున్న కలెక్షన్లు!

రామోజీ ఫిలింసిటీలో రెండ్రోజుల పాటు కోడెలు షూటింగ్‌లో పాల్గొనగా.. సినిమాలోని ప్రారంభ సన్నివేశం, క్లైమాక్స్‌ సన్నివేశంలో ఇవి కన్పిస్తాయి. బాలకృష్ణ లాంటి హీరోతో కలిసి ప్రధానమైన సినిమాలో తన కోడెలు నటించడం, చక్కటి గుర్తింపు రావడం ఆనందంగా ఉందని శ్రీనివాస్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.