Rajinikanth: లెజెండరీ శివాజీ ప్రయాణం.. నేటి తరానికి ఆదర్శం

రజనీ అవార్డుల ముత్యాల హారంలో ఓ కలికితురాయి...దాదా సాహేబ్ ఫాల్కే. రజనీకి దక్కిన అపూర్వ గౌరవమే. కానీ రజనీ అన్న మూడక్షరాల పేరు వెనకున్న స్టార్ డమ్‌తో ఏ అవార్డ్ తులతూగుతూంది..

Rajinikanth: లెజెండరీ శివాజీ ప్రయాణం.. నేటి తరానికి ఆదర్శం

Rajinikanth2

Rajinikanth: రజనీ అవార్డుల ముత్యాల హారంలో ఓ కలికితురాయి…దాదా సాహేబ్ ఫాల్కే. రజనీకి దక్కిన అపూర్వ గౌరవమే. కానీ రజనీ అన్న మూడక్షరాల పేరు వెనకున్న స్టార్ డమ్‌తో ఏ అవార్డ్ తులతూగుతూంది. వెండితెరపై ఒక్కసారి కనిపిస్తే చాలనుకునే అభిమానుల ప్రేమతో ఏ రివార్డ్ పోటీపడుతుంది. అవును తలైవ చెంతకు ఏదీ అంత సింపుల్ గా రాలేదు. దాని వెనుకున్న కృషి, పట్టుదల చాలామందికి తెలియదు. లేకపోతే ఒక అతిసామాన్యుడు హీరోగా మారి ఇన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరించడం అంటే మాటలా…?

Rajinikanth: నడిస్తే స్టైల్.. మాట్లాడితే కేక.. అసలేంటీ రజనీ మేనియా!

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో రజనీని చూసినవారికి హీరో మెటీరియల్ లా అనిపించలేదు. అమ్మాయిలు కలలుగానే డ్రీమ్ బాయ్ లా ఊహించుకోనులేదు. కానీ తనని తాను మార్చుకుంటూ, హీరోగా మలుచుకుంటూ…నువ్వే మా వాడివని దర్శకనిర్మాతలు వెంటపడేలా ఎదిగారు. ఆయన స్ట్రైలే సినిమాకు స్టామినా అని గుర్తించేలా చేసారు. ప్రొడ్యూసర్స్ పాలిట కాసులవర్షం కురిపించారు. బస్సులో ఈల వేసిన కండక్టర్ శివాజీ… తనకోసం ఈలలు వేయించుకున్న మాస్ హీరోగా ఎదిగిన క్రమం..ఓ లెజండరీ ప్రయాణం. నేటి తరానికి ఆదర్శం.

Rajinikanth : రజినీ కాంత్‌తో రాజమౌళి..!

తలైవా ప్రతిభ ఒక్క తమిళ్‌కే పరిమితం కాలేదు. తెలుగు, కన్నడ, మళయాలంలో ట్రెండ్ సెట్టర్‍‌గా మారారు. ఆలిండియా సూపర్‌స్టార్‌ అనిపించుకున్నారు. ఆయన చేసిన సినిమాలకు తోడు.. సామాజిక సేవ కార్యక్రమాలు రజనీకాంత్ ను ఓ స్థాయిలో నిలబెట్టాయి. నిర్మాతగా, స్క్రీన్‌రైటర్‌గా చిత్ర పరిశ్రమకు రజనీ సేవలు అద్భుతం. తలైవా అంటే కేవలం సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలో కూడా సూపర్‌స్టార్‌ చాలా డిఫరెంట్. ఒక కథానాయకుడికి ఇవన్నీ సాధ్యమేనా?… అసలేంటి తలైవా మేనియా…?

Rajinikanth: కూతురు దర్శకత్వంలో రజనీ తదుపరి సినిమా?

మహారాష్ట్ర సొంత ప్రాంతమైనా కర్ణాటక, బెంగుళూరులో రామోజీరావ్ గైక్వాడ్, రామాబాయి దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు. తల్లిదండ్రులు శివాజీరావ్ గైక్వాడ్ అన్న పేరుపెట్టుకున్నారు. తండ్రి పోలీసు కానిస్టేబుల్. తొమ్మిదేళ్ల వయసులోనే తల్లి మరణించడంతో చిన్నతనం నుంచే కష్టాలు అనుభవించారు. ప్రాథమిక విద్యతో పాటూ రామకృష్ణ మిషన్ లో వేదాలు నేర్చుకున్నారు. పొట్టకూటి కోసం 1966 నుంచి 1973 వరకు ఎన్నో చిన్నచితకా పనులు చేసుకుంటూ గడిపారు. కూలీ పనులకు కూడా వెనుకాడలేదు. చివరకు బస్సు కండక్టర్‌గా దొరికిన ఉద్యోగమే శివాజీ లైఫ్ ని మలుపుతిప్పింది. చిన్నతనం నుంచే నాటకాలన్నా, సినిమాలన్నా రజినీకి మహా ఇష్టం. ఆయన వేసిన ప్రతీ నాటకంలో తన సేపరేట్ స్టైల్ చూపించేవారు. అందరు కండక్టర్స్ లా ఉంటే రజనీ ఎలా అవుతారు.. చేస్తున్న ఉద్యోగం కూడా స్టైలిష్ గా చేసేవారు. నాటకాల్లో అద్భుత నటన ప్రదర్శిస్తున్న శివాజీని స్నేహితుడు రాజ్‌ బహదూర్‌ ప్రోత్సహించారు. ఎలా అయినా నటుడిగా నీ అదృష్టాన్ని పరీక్షించుకొమ్మని డబ్బులిచ్చి మరీ మద్రాసుకు పంపించాడు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో డైరెక్టర్ కె.బాలచందర్ దృష్టిలో పడ్డారు. శివాజీ అన్న పేరును రజినీకాంత్ గా మార్చి… తమిళ్ భాషను త్వరగా నేర్చుకోమ్మని చెప్పి… తన అపూర్వ రాగంగళ్ సినిమాలో అవకాశం ఇచ్చి రజనీ జీవితానికి గాడ్ ఫాదర్ అయ్యారు బాలచందర్.