Akshay Kumar : ‘ది కశ్మీర్ ఫైల్స్’ వల్ల నా సినిమా కలెక్షన్స్ తగ్గాయి

ఈ ఈవెంట్ లో అక్షయ్ కుమార్ కశ్మీర్ ఫైల్స్ సినిమాపై మాట్లాడారు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ''వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్‌ ఫైల్స్‌ మంచి విజయాన్ని..............

Akshay Kumar : ‘ది కశ్మీర్ ఫైల్స్’ వల్ల నా సినిమా కలెక్షన్స్ తగ్గాయి

Akshay Kumar

Akshay Kumar :  ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కేవలం మౌత్ టాక్ తోనే భారీ విజయం సాధించి వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది. ఇప్పటికే 150 కోట్ల కలెక్షన్స్ ని దాటేసింది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ప్రేక్షకులే కాక సెలబ్రిటీలంతా అభినందనలు కురిపిస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు.

తాజాగా మధ్యప్రదేశ్ భోపాల్ లో చిత్ర భారతి ఫిల్మోత్సవ్ జరిగింది. ఈ ఈవెంట్ కి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు విచ్చేశారు. కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కూడా వచ్చారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో అక్షయ్ కుమార్ కశ్మీర్ ఫైల్స్ సినిమాపై మాట్లాడారు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ”వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్‌ ఫైల్స్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విచిత్రమేంటంటే ఈ సినిమా ఎఫెక్ట్‌ నా సినిమాపై కూడా పడింది. నేను నటించిన బచ్చన్‌ పాండే కలెక్షన్లను కశ్మీర్‌ ఫైల్స్‌ దెబ్బకొట్టింది” అంటూ నవ్వుతూ తెలిపాడు.

Aadhi – Nikki : ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని నిశితార్థ వేడుకలు

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో డైరెక్టర్ వివేక్‌ అగ్నిహోత్రి ఈ వీడియోని తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ అక్షయ్‌ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రావడంతో చాలా చోట్ల కశ్మీర్ ఫైల్స్ సినిమాని తీసేశారు. దీంతో ఈ సినిమా కలెక్షన్లపై ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బ కొట్టింది.