పవన్‌తో పోరాడుతున్న రానా..

పవన్‌తో పోరాడుతున్న రానా..

Rana Daggubati: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం:12 గా నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. పవన్ కళ్యాణ్ పాల్గొనగా ఫైట్ మాస్టర్ దిలీప్ సబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సన్ని వేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సాగర్.కె.చంద్ర.

కాగా నేటినుంచి ఈ యాక్షన్ సన్నివేశాలలో రానా, పవన్ కళ్యాణ్‌తో కలసి పాలు పంచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, రానా పాల్గొనగా పది రోజులపాటు హైదరాబాద్‌లో చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలిపారు నిర్మాత. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తున్న విషయం విదితమే.

Pawan Kalyan

ప్రముఖ నటులు సముద్ర ఖని, మురళీ శర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఈ చిత్రానికి ఇప్పటివరకు ఎంపికైన తారాగణం కాగా ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులుగా సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగీత దర్శకుడు థమన్.ఎస్, సమున్నత ప్రతిభావంతులైన ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రాహకునిగా, ఎడిటర్‌గా నవీన్ నూలి, కళా దర్శకునిగా ఏ.ఎస్.ప్రకాష్ ఎంపిక అయ్యారు.. ఇక ఈ చిత్రంలోని ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.