బాలయ్య సినిమా టైటిల్ ఇదేనా? ఉగాది కానుకగా అప్‌డేట్!

బాలయ్య సినిమా టైటిల్ ఇదేనా? ఉగాది కానుకగా అప్‌డేట్!

The Much Awaited Bb3titleroar To Be Revealed On This Ugadi

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే హిట్.. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్ సినిమాలు కాగా.. వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ఇప్పుడు సెట్స్‌పై ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ విడుదల కాగా.. విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఉగాది సంధర్భంగా.. ఏప్రిల్ 13వ తేదీన 12గంటల 33నిమిషాలకు టైటిల్ ప్రకటన చేయనున్నారు.

ఈ మేరకు ద్వారకా క్రియేషన్స్ ఓ ప్రకటన ట్విట్టర్ ద్వారా చేసింది. ఈ చిత్రానికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత కాగా.. ఈ చిత్రం మే 28న రిలీజ్ కానుంది. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైశ్వాల్ కథానాయిక. తమన్ బాణీలు అందిస్తున్నాడు. ఇక ఉగాది కానుకగా.. బాలయ్య రెండో క్యారెక్టర్‌కు సంబంధించిన లుక్‌ కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘అఖండ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా అభిమానులు చెబుతున్నారు.

టాలీవుడ్ యాక్ట‌ర్ శ్రీకాంత్ ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్న‌ారు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పూనకాలే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.