Actor Suman: ఇండియన్ ఆర్మీకి సుమన్ విరాళం.. వాస్తవం కాదు -సుమన్

ఇండియన్ ఆర్మీకి టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

Actor Suman: ఇండియన్ ఆర్మీకి టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సుమన్ భారత రక్షణ దళానికి విరాళం అందించలేదు.

ఇండియన్ ఆర్మీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 117 ఎకరాల భూమిని సుమన్ విరాళంగా అందించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని సుమన్ స్వయంగా ప్రకటించారు.

సుమన్ మాట్లాడుతూ.. “సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. వాటిని ఎవరూ నమ్మొద్దు. ఆ భూమికి సంబంధించిన వివాదం ఇంకా కోర్టులో కొనసాగుతోంది. వివాదానికి పరిష్కారం రాగానే వ్యక్తిగతంగా నేనే వివరాలు మీడియా ద్వారా వెల్లడిస్తాను. దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతాను” అంటూ చెప్పుకొచ్చారు.