Movie Ticketing Portal‌ : సినిమా టికెటింగ్ పోర్టల్‌ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపుతుందా..?

ఏపీలో ఆన్‌లైన్‌ టికెట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని అన్ని థియేటర్లకు ఆన్‌లైన్ టిక్కెట్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోంది.

Movie Ticketing Portal‌ : సినిమా టికెటింగ్ పోర్టల్‌ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపుతుందా..?

Online Tickets (1)

movie tickets online : ఏపీలో ఆన్‌లైన్‌ టికెట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని అన్ని థియేటర్లకు ఆన్‌లైన్ టిక్కెట్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. సినీ ప్రముఖులు కోరితేనే.. ఆన్‌లైన్ విధానంలో సినిమా టిక్కెట్ల అమ్మకం జరపాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. సినీ పెద్దల సూచననే ప్రభుత్వం పరిశీలించిందని.. సినిమా టికెట్ల విషయంలో జరుగుతున్న పన్ను ఎగవేతకు అడ్డుకట్ట వేసేందుకే ఈ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను తీసుకొచ్చామని చెబుతున్నారు.

బ్లాక్ టిక్కెట్లు లేకుండా అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. టిక్కెట్ రేట్లను పెంచడం, ఇష్టానుసారంగా షోలు వేయడాన్ని నియంత్రిస్తూ.. ప్రజలకు మేలు చేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామంటోంది ప్రభుత్వం. ఇక ఈ అంశంపై.. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ముందుకెళ్లాలనే నిర్ణయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల విక్రయంపై కేబినెట్‌లో చర్చించి మంత్రివర్గం తుది ఆమోదం తెలపనుంది.

AP Cabinet : ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

అయితే.. టికెట్ల రేట్లు పెంచే అవకాశంపై నిర్మాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు సైతం చేశారు. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవగా.. ఇప్పట్లో టికెట్ రేట్ల పెంపు ఉండే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇవాళ జరిగే కేబినెట్‌లో భేటీలో సినిమా టికెట్‌ ధరలపైనా ప్రభుత్వం పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సినిమా టికెట్ల రేట్లు పెంచాలా.. లేకపోతే ఇప్పుడున్న రేట్లనే యథాతధంగా కంటిన్యూ చేయాలా అన్నదానిపైనా ఏపీ సర్కార్‌ ఓ క్లారిటీ ఇవ్వనుంది.

ఆన్‌లైన్‌ టికెటింగ్‌ పోర్టల్‌పై ఇంకా క్లారిటీ రాకపోవడంతో.. కొన్ని సినిమాల రిలీజ్‌ ఎప్పుడనేది తేలడం లేదు. పెద్దపెద్ద సినిమాలు సైతం.. షూటింగ్‌లు పూర్తి చేసుకుని.. రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాయి. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్, బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ, అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలు డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉంది.

AP Government : టీటీడీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

టికెట్ రేట్లు గురించి క్లారిటీ రాకపోతే ఈ సినిమాలు వాయిదా పడే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ సినిమాలు జనవరి నెలలో విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. మరోవైపు.. జనవరిలో ఇప్పటికే రిలీజ్ డేట్‌లు ప్రకటించుకున్న సినిమాల విషయంలో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.