Kalyan Ram: అసెంబ్లీలో మహిళలను దూషించే పరిస్థితి దురదృష్టకరం: కళ్యాణ్ రామ్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వ్యక్తిగత దూషణల దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేతలు అసెంబ్లీలో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబుపై వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్ పై టీడీపీ క

Kalyan Ram: అసెంబ్లీలో మహిళలను దూషించే పరిస్థితి దురదృష్టకరం: కళ్యాణ్ రామ్!

Kalyan Ram

Kalyan Ram: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వ్యక్తిగత దూషణల దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేతలు అసెంబ్లీలో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబుపై వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్ పై టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు నారా, నందమూరి కుటుంబాల నుండి పలువురు అసెంబ్లీలో విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. సినీ పరిశ్రమ నుండి ఇప్పటికే బాలకృష్ణ, నారా రోహిత్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించగా ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా ఈ విషయంపై స్పందించాడు.

Jr NTR: మాట వ్యక్తిత్వానికి ప్రమాణం.. అసెంబ్లీలో ఘటనపై తారక్!

అసెంబ్లీ అనేది ప్రజాసమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్నవారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడట అనేది ఎంతో బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరమని కళ్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.

Balakrishna Live : ఖబడ్దార్ వైసీపీ నేతల్లారా! బావ కన్నీళ్లపై బాలయ్య ఫైర్- Live Updates

అంతేకాదు అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నానన్న కళ్యాణ్ రామ్.. పూజ్యులు తాతగారు రామారావు గారు మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందామని స్టేట్మెంట్ ద్వారా తెలియజేశాడు. సినీ పరిశ్రమ నుండే కాకుండా రాజకీయాలలో ఉన్న ఈ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న పురందేశ్వరి, హరికృష్ణ కుమార్తె సుహాసిని కూడా అసెంబ్లీ ఘటనను తీవ్రంగా ఖండించి ఇది పద్ధతి కాదని హెచ్చరించారు.