Star Directors: డైరెక్టర్ల మెడ మీద కత్తి.. ఫ్లాపైతే చేతగాని తనమేనా?

సినిమా ఇండస్ట్రీలో సక్సెసే మాట్లాడుతుంది. ఒక డైరెక్టర్ కి వరసగా రెండు సక్సెస్ లు వచ్చాయంటే రేంజ్ మారిపోతుంది. అదే ఫ్లాప్ ఫేస్ చేస్తే.. పలకరించే దిక్కు కూడా ఉండదు.

Star Directors: డైరెక్టర్ల మెడ మీద కత్తి.. ఫ్లాపైతే చేతగాని తనమేనా?

Star Directors

Star Directors: సినిమా ఇండస్ట్రీలో సక్సెసే మాట్లాడుతుంది. ఒక డైరెక్టర్ కి వరసగా రెండు సక్సెస్ లు వచ్చాయంటే రేంజ్ మారిపోతుంది. అదే ఫ్లాప్ ఫేస్ చేస్తే.. పలకరించే దిక్కు కూడా ఉండదు. అప్పటి వరకూ ఎన్ని వందల కోట్ల కలెక్షన్లు రాబట్టినా, ఎంత మంది హీరోలకు కెరీర్ హిట్స్ ఇచ్చినా.. అవన్నీ పట్టించుకోకుండా డైరెక్టర్లనే బలిపశువుల్ని చేస్తోంది ఇండస్ట్రీ.

Telugu Directors: పాన్ ఇండియా టార్గెట్.. ఈ దర్శకులకు ఇప్పుడిదే బిగ్ చాలెంజ్

సినిమా హిట్ అయితే హీరో వల్ల హిట్ అయ్యిదంటారు. అదే కాస్త అటూ ఇటైతే ఫ్లాప్ భారం మొత్తం డైరెక్టర్ నెత్తిన వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. సక్సెస్ లు ఇచ్చినన్నాళ్లూ ఆహా ఓహో అన్న జనాలు ఒక్క ఫ్లాప్ పడిందంటే అంతా మీవల్లే అంటూ డైరెక్టర్లని నిందిస్తున్నారు. ఇన్నేళ్ల సక్సెస్ ని, ఇన్నాళ్ల లెగసీని పట్టించుకోకుండా కనికరం లేకుండా డైరెక్టర్లనే ఫ్లాప్ లకు బాధ్యుల్నిచేస్తున్నారు.

New Directors: లక్కీ చాన్స్.. పెద్ద బ్యానర్లను పట్టేస్తున్న కొత్త దర్శకులు!

కొరటాల శివ అన్ స్టాపబుల్ హిట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేశారు. 2013లో కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత షార్ట్ స్పాన్ లోనే ఎంతో మంది హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ సక్సెస్ లు ఇచ్చి స్టార్ హీరోల్ని చేశారు. మిర్చి ముందు వరకూ జస్ట్ హీరోగా ఉన్న ప్రభాస్ ని కమర్షియల్ స్టార్ హీరోని చేసింది కొరటాల. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, మహేష్ తో శ్రీమంతుడు, భరత్ అను నేను లాంటి సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ ఇవ్వడమే కాదు హీరోల కెరీర్ కి మైలేజ్ ఇచ్చి టాప్ డైరెక్టర్ అయ్యారు.

Star Heroes: నాన్ స్టాప్ షెడ్యూల్స్.. స్టార్ హీరోల మూవీ లైనప్ అదుర్స్!

కొరటాల శివ ఇన్నేళ్ల కెరీర్ లో చేసింది 5 సినిమాలే. కానీ ప్రతి సినిమా హీరో కెరీర్ లో ది బెస్ట్ సక్సెస్ ఇచ్చిన సినిమాలే. అయితే లేటెస్ట్ గా చిరంజీవి, చరణ్ కాంబినేషన్లో కొరటాల డైరెక్ట్ చేసిన ఆచార్య మూవీ రిలీజ్ అయ్యింది. 200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆచార్య మూవీ అనుకున్నంత రెస్పాన్స్ సంపాదించుకోలేకపోయింది. ఓన్లీ హీరోల ఎలివేషన్ మీద తప్పించి కథ మీద శ్రద్ద పెట్టలేదని, అసలు దీన్ని సినిమా అంటారా..? అసలు కొరటాల డైరెక్షన్లే సినిమా దొబ్బింది అంటూ ఆడిపోసుకుంటున్నారు జనాలు.

Malty starrer Movies: వచ్చేస్తున్న టాప్ స్టార్ మల్టీస్టారర్ కాంబినేషన్స్!

ఎస్‌ ఎస్‌ రాజమౌళి అంటే సూపర్ సక్సెస్‌ రాజమౌళి అని పిలుచుకుంటారు ఆయన ఫ్యాన్స్. సినిమా తీస్తే అది సూపర్ డూపర్ హిట్టు కావాల్సిందే ఇంత వరకు ఫెయిల్యూర్‌ అనేదే లేని వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలతో తెలుగు సినిమా స్టామినాను వరల్డ్ వైడ్ గా చూపించిన ఈ లెజండరీ డైరెక్టర్ కెరీర్ స్టార్టింగ్ నుంచి చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే. రాజమౌళి 20 ఏళ్లలో చేసింది పది సినిమాలైనా.. ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్.. ఇలా ప్రతి హీరోకి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి స్టార్ హీరోల్నిచేశారు. అయితే ఇదంతా ఒక వైపు మాత్రమే.
New Directors: ఈ హీరోల్ని మెప్పించలేకపోతున్న కొత్త దర్శకులు.. లోపం ఎక్కడ?
రాజమౌళి చేసిన ఈ సినిమాలన్నీ హిట్ అయ్యాయి.. ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని అందుకున్నాయి. కానీ మొన్నీమధ్య వచ్చిన ట్రిపుల్ఆర్ విషయంలో లెక్క కాస్త తప్పింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ ఆకాశంలో ఉన్న ఆడియన్స్ అంచాలను అందుకునే విషయంలో కాస్త తడబడింది. 2 వేల కోట్ల కలెక్షన్లు అనుకున్నది కాస్తా.. వెయ్యికి పైగా వచ్చి ఆగిపోయింది. దాంతో అప్పటి వరకూ దర్శకధీరుడు, ఫ్లాప్ ఎరుగని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అన్నవాళ్లే.. రాజమౌళి పనైపోయింది. ఇక రాజమౌళికి డౌన్ ఫాల్ స్టార్టయ్యింది. ఇక రాజమౌళి సినిమాలు చూసి బోర్ కొట్టేసింది.. అంటూ సోషల్ మీడియాలో రాజమౌళిని, ట్రిపుల్ఆర్ ని తెగ ట్రోల్ చేశారు జనాలు.