RRR: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది.. 11గంటలకు యూట్యూబ్‌లో!

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ 'ఆర్ఆర్ఆర్‌`.

RRR: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది.. 11గంటలకు యూట్యూబ్‌లో!

Rrr

RRR: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌`. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రయూనిట్ లేటెస్ట్‌గా విడుదల చేసింది.

ఉదయం 10 గంటలకు ఈ చిత్ర ట్రైలర్‌‌ను థియేటర్లలో విడుదల చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతానికి ఈ ట్రైలర్‌ను థియేటర్లలో మాత్రమే విడుదల చేయగా.. ఉదయం 11గంటలకే యూట్యూబ్‌లో కూడా అందుబాటులోకి రాబోతుంది.

తెలుగు రాష్ట్రాలలో రెండొందలకు పైగా థియేటర్లలో సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ నిడివి మూడు నిమిషాల 7సెకన్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ ట్రైలర్‌ కోసం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుండగా.. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ ఉన్నట్లు చెబుతున్నారు చూసిన అభిమానులు.

సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి రాబోతుంది ఆర్ఆర్ఆర్. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతుంది.

Better.com CEO: పెద్ద తప్పే చేశాను.. జూమ్ కాల్‌లో ఉద్యోగులను తొలగించిన సీఈఓ క్షమాపణలు