MAA Elections: ‘మా’ ఎలక్షన్స్‌పై ట్విట్టర్ వేదికగా రగడ!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ (MAA) ఎన్నికల వ్యవహారంలో కొత్త మలుపులు తిరుగుతుంది. పైకి ఎలాంటి కదలికలు లేనట్లుగానే కనిపిస్తున్న ఈ ఎన్నికల వ్యవహారం లోలోపల రగులుతున్న భావన కలుగుతుంది. ట్విట్టర్ లో జరుగుతున్న వార్ దీనికి సాక్ష్యంగా కనిపిస్తుంది. మా ఎలక్షన్స్ ఎప్పుడు అని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించగా అందుకు ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

MAA Elections: ‘మా’ ఎలక్షన్స్‌పై ట్విట్టర్ వేదికగా రగడ!

Maa Elections

MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ (MAA) ఎన్నికల వ్యవహారంలో కొత్త మలుపులు తిరుగుతుంది. పైకి ఎలాంటి కదలికలు లేనట్లుగానే కనిపిస్తున్న ఈ ఎన్నికల వ్యవహారం లోలోపల రగులుతున్న భావన కలుగుతుంది. ట్విట్టర్ లో జరుగుతున్న వార్ దీనికి సాక్ష్యంగా కనిపిస్తుంది. మా ఎలక్షన్స్ ఎప్పుడు అని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించగా అందుకు ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఇది ఒకవిధంగా మరోసారి ఎన్నికలపై హీట్ పెంచడమే కాకుండా అసలు ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా అనే అనుమానాలు కలిగిస్తున్నాయి.

ప్రకాష్ రాజ్ ప్రశ్నకు బదులు చెప్పిన నరేష్.. ‘జనరల్ బాడీ మీటింగ్‌లో ఎన్నికలపై ఒక తీర్మానం చేద్దామనుకున్నాం. కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా జనరల్ బాడీ మీటిగ్ జరగలేదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మా ఎన్నికలు సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని ఇది వరకే చెప్పాం. మెయిల్‌ కూడా పంపించాం. ఇప్పుడు మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడుగుతున్నారు. ఇది నీళ్లు నింపకుండానే స్విమ్మింగ్ పూల్‌లో దూకుతాను అన్నట్టుగా ఉంది. మా నిర్ణయం వచ్చేవరకు వెయిట్ చేయండి సార్‌’ అంటూ నరేష్‌ ఘాటు రిప్లై ఇచ్చారు.

ఈ విషయంపై ఏప్రిల్ 12న ఇదివరకే ప్రకాష్‌రాజ్‌కి పంపిన లేఖను కూడా జత చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరి ట్వీట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ‘మా’ సాంప్రదాయం ప్రకారం.. ఇంచుమించుగా రెండేళ్లకు ఒకసారి ‘మా’ ఎన్నికలు జరగాలి. ఆ ప్రకారం.. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్‌ వల్ల ‘మా’ ఎన్నికలు జరగలేదు. అప్పుడే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారంటూ నటుడు ప్రకాష్‌రాజ్‌ ‘మా’ అధ్యక్షుడికి ఏప్రిల్‌లో ఒక లేఖ రాశారు. ఆ లేఖకు.. సెప్టెంబర్‌లో జరపవచ్చని ‘మా’ కార్యవర్గం సమాధానమిచ్చింది.

మా సమాధానంతో ప్రకాష్‌ రాజ్‌ తన ప్యానల్‌ను ప్రకటించారు. మంచువిష్ణు, జీవిత, హేమ కూడా రంగంలోకి దిగారు. వాస్తవానికి ఈ నెల 9న మా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మీటింగ్‌ జరగాల్సి ఉండగా ‘మా’ ఆఫీసులో సిబ్బందికి కోవిడ్‌ రావటంతో ఆ భేటీ జరిగే అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరపాలనే విషయంపై ఈసీనే నిర్ణయం తీసుకోవాలి. ఈసీ సమావేశమే జరగకపోతే.. ఎన్నికల తేదీపై స్పష్టత రాదు. ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈసీని వాయిదా వేసే అవకాశాలే కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.