Raviteja Krack: ధియేటర్ల ఓపెన్.. మళ్ళీ మాస్ రాజా ‘క్రాక్’ హంగామా!

కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం తెలుగులో భారీ సక్సెస్ కొట్టిన సినిమా క్రాక్. మాస్ మహారాజా మళ్ళీ క్రాక్ తో ట్రాక్ ఎక్కాడని విశ్లేషకులు గట్టిగా చెప్పారు. కేవలం యాభై శాతం సీటింగ్ కెపాసిటీతో క్రాక్ సినిమా భారీ సక్సెస్ దక్కించుకుంది. అలా కరోనా తర్వాత మళ్ళీ మొదలైన సినిమా సందడిలో క్రాక్ ఒక విధంగా ఆశలు చిగురించేలా చేసింది.

Raviteja Krack: ధియేటర్ల ఓపెన్.. మళ్ళీ మాస్ రాజా ‘క్రాక్’ హంగామా!

Theaters Open Ravi Teja Crack Release Again

Raviteja Krack: కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం తెలుగులో భారీ సక్సెస్ కొట్టిన సినిమా క్రాక్. మాస్ మహారాజా మళ్ళీ క్రాక్ తో ట్రాక్ ఎక్కాడని విశ్లేషకులు గట్టిగా చెప్పారు. కేవలం యాభై శాతం సీటింగ్ కెపాసిటీతో క్రాక్ సినిమా భారీ సక్సెస్ దక్కించుకుంది. అలా కరోనా తర్వాత మళ్ళీ మొదలైన సినిమా సందడిలో క్రాక్ ఒక విధంగా ఆశలు చిగురించేలా చేసింది. ఆ తర్వాతే జాతి రత్నాలు, వకీల్ సాబ్ లాంటి సినిమాలు అదే దారిలో సక్సెస్ వైపు నడిచాయి. కాగా అప్పుడు ఫస్ట్ వేవ్ లో థియేటర్లు ఓపెన్ తర్వాత తెరమీద పడిన క్రాక్ సినిమానే ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత కూడా వెండితెర మీద ప్రసారం చేస్తున్నారు.

ఈ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండడంతో ఒక్కొక్కటిగా అన్నిటికి ప్రభుత్వం సడలింపులు ఇస్తుంది. ఇందులో భాగంగానే థియేటర్లు మళ్ళీ తలుపులు తెరుచుకుంటున్నాయి. తాజాగా వైజాగ్ జగదాంబ థియేటర్ లో ఈ ఆదివారం మార్నింగ్ ఒక షోతో రీ ఓపెన్ చేయనున్నారు. తొలివారం షోగా క్రాక్ సినిమాను అక్కడ విడుదల చేశారు. దీనితో మాస్ రాజా ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తుండగా సినీ ప్రముఖులు కూడా క్రాక్ లాంటి శుభారంభంతో మళ్ళీ రీఓపెన్ చేయడం శుభపరిణామంగా భావిస్తున్నారు.